రాయభారం చేసే ఆ శ్రీ కృషేణుడెవరు.?

revanth-reddy-chiranjeevi-allu-arjun

అసెంబ్లీ సాక్షిగా హీరో అల్లు అర్జున్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వైల్డ్ కామెంట్స్ కు బన్నీ ఇచ్చిన స్ట్రాంగ్ రిప్లయ్, దానికి కొనసాగింపుగా తెలంగాణ పోలీస్ శాఖ చూపించిన ఆధారాలు, ఇక ఆ తరువాత అల్లు ఇంటి మీద జరిగిన దాడి ఇలా అన్ని ఒకదానికొకటి ఒక ఫ్లో లో జరుగుతూ వెళ్లిపోతున్నాయి.

ADVERTISEMENT

అయితే ఇక ఈ వివాదాన్ని మరి తెగేదాకా లాగకూడదు అని నిశ్చయించుకున్న అల్లు కుటుంబం తమ ఇంటి మీద జరిగిన దాడికి గాను అందరు సంయమనం పాటించాలని కోరింది. అలాగే ఇప్పుడు అదే అందరికి మంచిది అంటూ ప్రకటించి అల్లు అరవింద్ తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు.

ఇక సినీ ప్రముఖుల ఇళ్ల మీద దాడి ఘటనను ఖండిస్తున్నట్టు ట్వీట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ కూడా తన హుందాతనాన్ని ప్రదర్శించారు. అయితే అల్లు కుటుంబం ఈ సంయమనం ఎదో ముందే పాటించి ఉంటే ఇప్పుడు ఈ వివాదం ఇక్కడి దాక వచ్చేది కాదనే భావన సర్వత్రా వినపడుతుంది.

అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు కౌంటర్ గా బన్నీ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే ఈ వివాదం మరో స్థాయి వరకు వెళ్లకపోయుండేది అంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక చేయాల్సిందల్లా దిద్దుబాటు చర్యలే. అయితే ఇందులో మొదటి అడుగు ఎటు వైపు నుంచి పడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే పుష్ప సినిమా బెనిఫిట్ షో తో మొదలైన ఈ వివాదంతో అటు తెలుగు చిత్ర సీమకు ఇటు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య దూరాన్ని పెంచింది. ఈ సందర్భంగా ఈ రెండు వర్గాల మధ్య ఏర్పడిన గ్యాప్ ను భర్తీ చేయడానికి టాలీవుడ్ తరుపున రేవంత్ సర్కార్ తో రాయభారం చేయగలిగిన ఆ శ్రీ కృషుణుడు ఎవరన్నది ఇక్కడ అంతు చిక్కని ప్రశ్న.

గతంలో టాలీవుడ్ తరుపున వైసీపీ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వెళ్లి జగన్ చేత అవమానాలు ఎదుర్కున్న మెగా స్టార్ చిరంజీవి ఈ సారి అల్లు కుటుంబం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ వద్దకు రాయభారానికి వెళతారా.? లేక తెలుగు సినీ ఇండస్ట్రీ కి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వారధిగా నియమించబడ్డ చైర్మన్ ఆఫ్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దిల్ రాజు చక్రం తిప్పనున్నారా.?

ADVERTISEMENT
Latest Stories