
తాడిని తన్నే వాడుంటే వాడి తల దన్నేవాడూ తప్పక ఉంటాడన్నట్లు తెలంగాణ రాజకీయాలను కంటి చూపుతో శాశించిన కేసీఆర్‌ని, రేవంత్ రెడ్డి ఊహించిని విదంగా మొదట శాసనసభ, తర్వాత లోక్‌సభ ఎన్నికలలో వరుసగా రెండుసార్లు దెబ్బతీశారు.
ఆ షాక్ నుంచి నేటికీ కొలుకోలేకపోతున్న కేసీఆర్ శాసనసభకు రాకుండా ఫామ్‌హౌస్ రాజకీయాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
Also Read – గెట్ రెడీ..స్టే ట్యూన్డ్ టూ ‘తాడేపల్లి ఫైల్స్’..!
శుక్రవారం ఫామ్‌హౌస్‌లో తనని కలిసేందుకు వచ్చిన బిఆర్ఎస్ నేతలతో మాట్లాడుతూ “మన పాలనలో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా ప్రగతి సాధించింది. దానిని రేవంత్ రెడ్డి ఒక్క ఏడాదిలో సర్వనాశనం చేసేశారు. ఆయన చెత్త పాలనని నేను మౌనంగా, గంభీరంగా గమనిస్తూనే ఉన్నాను.
నాకు చిన్నగా దెబ్బ కొట్టే అలవాటు లేదు. కొడితే చాలా గట్టిగానే కొడతాను. ఫిబ్రవరి నెలాఖరున భారీ బహిరంగ సభ పెట్టుకుందాం. అందరూ తయారవ్వండి,” అని కేసీఆర్ అన్నారు.
Also Read – జగన్ 2.0: ఏపీకి, చంద్రబాబుకి మరింత కష్టమే!
ఇన్ని నెలల తర్వాత కేసీఆర్ నోరువిప్పు నాలుగు ముక్కలు మాట్లాడేసరికి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేయడం సహజం. కానీ వారితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా వచ్చేసింది.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందిస్తూ, “14 నెలలుగా ఫామ్‌హౌస్‌లో పడుకొన్నవాడివి ముందుకు లేచి తిన్నగా నిలబడటం ప్రాక్టీస్ చేసుకో. శాసనసభకు రాకుండా ఫామ్‌హౌస్‌లో కూర్చొని రాజకీయాలు చేసే నీకు సోషల్ మీడియాలో లైకులు వచ్చాయని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా?
Also Read – జగన్ మొదలెట్టేశారు.. విజయసాయి రెడీయా?
సల్మాన్ ఖాన్, రాఖీ సావంత్ ఇద్దరిలో రాఖీ సావంత్‌కే ఎక్కువ లైకులు వస్తాయి. కానీ అంత మాత్రాన్న సల్మాన్ ఖాన్ హీరో కాకుండా పోతాడా?నువ్వు అలాగే.
అయినా ఫామ్‌హౌస్‌లో పడుకుంటున్న నువ్వు చెల్లని వెయ్యి రూపాయల నోటు వంటివాడివి. నీ కోసం ప్రజలెవరూ ఎదురుచూడటం లేదు. రెండుసార్లు ఓడిపోయినా ఇంకా ప్రగల్భాలు తగ్గలేదు. దమ్ముంటే శాసనసభకు రా… అక్కడే అమీ తుమీ తేల్చేసుకుందాం,” అని సిఎం రేవంత్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు.
కేసీఆర్ మౌనంగా ఫామ్‌హౌస్‌లోనే ఉండిపోటం కూడా వ్యూహాత్మకమే అని బిఆర్ఎస్ పార్టీ నేతలు తమ నాయకుడి రాజకీయ సన్యాసాన్ని సమర్ధించుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా రేవంత్ రెడ్డి, మంత్రులు ఎప్పటికప్పుడు వారి గాలి తీసేస్తూనే ఉన్నారు.
ఇప్పుడు కేసీఆర్ మొదటిసారి నోరు విప్పి మాట్లాడితే ఆయనకీ సిఎం రేవంత్ రెడ్డి ఇంత ఘాటుగా చురకలు వేసి దమ్ముంటే శాసనసభకు రావాలని సవాలు చేస్తున్నారు.
కానీ ఫిబ్రవరి నెలాఖరుణ బహిరంగ సభకి వస్తానని కేసీఆర్ చెప్పారు కనుక శాసనసభకు రాకపోవచ్చు. శాసనసభకు రాకుండా ఫామ్‌హౌస్‌లో నుంచి ప్రగల్భాలు పలికితే ప్రజలు కూడా కేసీఆర్‌నే తప్పు పడతారని గ్రహించడం లేదు.