
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన త్రి భాష విధానంతో తమిళనాడు రాజకీయం వేడెక్కింది. మోడీ, షాల నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పింది తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం. హిందీ భాషతో దక్షిణాది పై ఉత్తరాది దాడి అంటూ ఉద్యమానికి సిద్దమైన తమిళనాడు సిఎం స్టాలిన్ తన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ అధిపతులకు పిలుపునిచ్చారు.
Also Read – అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం.. భేష్!
అయితే ఎన్డీయే ప్రభుత్వంలో భాగమైన ఏపీ ప్రభుత్వం హిందీ భాష పై తమకు వ్యతిరేకత లేదని, త్రి భాష విధానం తమకు ఆమోదయోగ్యమే అంటూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుపలికారు సీఎం చంద్రబాబు. ఇక వైసీపీ అధినేత వైస్ జగన్ బీజేపీ కి వ్యతిరేకంగా మోడీ షాల నిర్ణయాన్ని ఢీ కొట్టే సాహసం చెయ్యలేరు. అలాగే జనసేన బీజేపీ పై వీర విధేత ప్రదర్శిస్తున్న నేపథ్యంలో బీజేపీ కి బేషరతు మద్దతు పలకడంలో ముందు వరుసలో ఉంటుంది.
ఇక తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ ఇప్పటి వరకు తెలంగాణ అనే ప్రాంతీయ వాదంతో రాజకీయం నడుపుతున్నందున కొత్తగా బీజేపీ నిర్ణయమైనా ఈ భాషావాదాన్ని భుజానకెత్తుకుని కోరుండి కొత్త చిక్కులను తెచ్చుకునే సాహసం చేయలేదు. ఇక తెలంగాణ లో అధికార పార్టీగా ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకముగా గళం విప్పింది.
Also Read – జగన్, చంద్రబాబు: ఇద్దరు భక్తుల కధ!
నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వివాదం మీద స్పందిస్తూ హిందీ మాకొద్దు..తెలుగే ముద్దు అంటూ స్టాలిన్ మాదిరి ప్రాంతీయ భాష పై తన మక్కువ చూపారు. హిందీని తమ పై బలవంతగా రుద్దవద్దని, హిందీ జాతీయ భాష కానీ కాదు, ఇది కేవలం దేశంలో ఎక్కువ మంది ఉచ్చరించే భాష మత్రమే అని ఇండియా టుడే కాన్ క్లావ్ లో తెలిపారు.
అలాగే హిందీ భాష పై ఇంత ప్రేమ వలక పోస్తున్న కేంద్ర పెద్దలు తెలుగు భాష కోసం ఏమైనా చేసారా.? అంటూ ప్రశ్నించారు. హిందీ అనేది ఒక ప్రత్యామ్నాయ బాషగానే పరిగణించాలి కానీ ఇలా బలవంతపు ప్రయత్నాలతో మా పై రుద్దే ప్రయత్నం చేయొద్దు అంటూ బీజేపీ విధానం పై తన నిర్ణయాన్ని వెల్లడించారు రేవంతు.
Also Read – కన్నప్ప తీయడం కూడా శివలీలే!
దీనితో ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా.? లేక రేవంత్ రెడ్డి నిర్ణయమా.? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ అధిష్టానం హిందీ భాష విధానం పై తన అభిపారాయన్ని ప్రకటించలేదు. కానీ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాత్రం హిందీ మాకొద్దు అంటూ కుండబద్దలు కొడుతున్నారు.