revanth_reddy

శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ వరుస ఓటముల తర్వాత కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కి పరిమితమై కేటీఆర్‌, హరీష్ రావుల చేత పార్టీని నడిపిస్తున్నారు. అయితే వారికి ఎప్పటికప్పుడు కేసీఆర్‌ సలహాలు, సూచనలు ఇస్తున్నారో లేదో కానీ ఇద్దరూ తప్పటడుగులు వేస్తున్నారు.

Also Read – తెలుగు వాడి ఆత్మ గౌరవం…తెలంగాణ నినాదం…!

నేడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్‌ రెడ్డి సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

దీనిపై కేటీఆర్‌ ఆచితూచి స్పందించాలి. కానీ వెంటనే స్పందిస్తూ, మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సచివాలయం చుట్టూ ఉండే ‘చెత్త’ని తొలగిస్తామంటూ ట్వీట్‌ చేశారు.

Also Read – కేసులు, విచారణలు ఓకే.. కానీ కేసీఆర్‌, జగన్‌లని టచ్ చేయగలరా?

దేశంలో కాంగ్రెస్‌ నేతలందరూ గౌరవించే సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ. పైగా దేశ ప్రధాని… అన్నిటికీ మించి తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.

అటువంటి వ్యక్తి విగ్రహాన్ని కేటీఆర్‌ ‘చెత్త’ అని అనడం, ఆ చెత్తని తొలగిస్తామని బెదిరించడం రెండూ పొరపాటనే అర్దమవుతూనే ఉంది.

Also Read – గెలిస్తే ఇక్కడి నుండి సమరం, లేదా తిరుగు ప్రయాణం..!

కనుక సిఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులు కూడా పోటాపోటీగా కేటీఆర్‌పై ఎదురుదాడి చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి మరో కొత్త విషయం బయటపెట్టారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ “పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన మీ ప్రభుత్వం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టించలేదు?మీ అయ్య (కేసీఆర్‌) విగ్రహం పెట్టించేందుకే కదా?

మీకు ఆ అవకాశం ఇవ్వము. డిసెంబర్‌ నెలాఖరులోగా సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం, బయట రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాము. దమ్ముంటే టచ్‌ చేసి చూపించు,” అని సవాల్ విసిరారు.

యాదాద్రిని పునర్నిర్మిస్తున్నప్పుడే కేసీఆర్‌ ఆలయంలో స్థంభాలపై తన బొమ్మ చెక్కించుకున్నారు. అంటే తాను దైవ సమానుడనని భావిస్తున్నారన్న మాట!

అలాగే దళిత బంధు పధకంలో డా.అంబేడ్కర్ ఫోటోతో పాటు తన ఫోటో వేయించుకునేవారు. అంటే డా.అంబేడ్కర్ అంతటివాడినని అనుకుంటున్నారన్న మాట!

కేసీఆర్‌ ‘తెలంగాణ గాంధీ’ ‘తెలంగాణ జాతిపిత’, దేశ్ కీ నేత, అంటూ బిఆర్ఎస్ పార్టీ చేత చాటింపు వేయించుకునేవారు. తన చిత్రపటానికి పాలాభిషేకాలు చేయించుకునేవారు.

కనుక రేవంత్‌ రెడ్డి ఆరోపిస్తున్నట్లు భవిష్యత్‌లో సచివాలయం ఆవరణలో కేసీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉండి ఉంటే ఆశ్చర్యం కాదు. బహుశః అందుకే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదనే రేవంత్‌ రెడ్డి వాదనని కొట్టిపడేయలేము.