cm-revanth-reddy

రాజకీయాలలో కొన్నిసార్లు అనూహ్య పరిణామాలు విచిత్రాలు జరుగుతుంటాయి. తమకు తిరిగే లేదనుకున్న కెసిఆర్ జగన్ ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఎన్నికలలో ఓడిపోవడం కూడా అటువంటిదే.

Also Read – ఉగ్రవాదులు శ్రీనగర్‌లోనే ఇళ్ళు కట్టుకు నివసిస్తున్నా…

వారు ఓడిపోవడానికి ఇంచుమించు ఒకే రకమైన కారణాలు ఉండటం ఆశ్చర్యం అనుకుంటే ఓడిపోయిన తర్వాత కూడా ఇద్దరూ ఒకే రకంగా రాజకీయాలు చేస్తుండడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది.

రేవంత్ రెడ్డి గతంలో ఎన్నడు మంత్రిగా కూడా చేయలేదు. కానీ తొలిసారే నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

Also Read – ప్రమోషన్స్‌ అంటే ఇలా.. అందరూ చూసి నేర్చుకోండయ్యా!

ఆ పదవి చేపట్టడానికి ఆయన ఎంతగా శ్రమించారో ఎంతగా పోరాడారో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటి గురించి అందరికీ తెలుసు.

కెసిఆర్ పదేళ్లలో అమలు చేయని హామీలు అనేకం ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొదటి ఏడు నెలల్లోనే కొన్ని హామీలను అమలు చేసి చూపించారు. నేటి నుంచి రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ పధకాన్ని అమలుచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ రేవంత్ రెడ్డి ఈ పథకం అమలు అమలు చేయడానికి బలమైన కారణమే కనిపిస్తోంది.

Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?

ఈ ఒక్క భారీ పథకం అమలుచేయడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలన్నీ గాలికి కొట్టుకుపోతాయి. తాత్కాలికంగానైనా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు, లోపాలపై నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే కాకుండా ఈ పధకంతోనే రేవంత్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి ప్రజలలో మంచి పేరు కూడా వస్తుంది.

లక్ష రూపాయల పంట రుణాలు మాఫీ చేయడానికి కేసీఆర్‌ పదేళ్ళు సమయం తీసుకుంటే, రేవంత్‌ రెడ్డి ఏడు నెలల్లోనే ఒకేసారి రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశారనే మంచిపేరు, కీర్తి కూడా లభిస్తాయి.

ఈ విషయం కెసిఆర్ కూడా గ్రహించారు కనుకనే పంట రుణాలు మాఫీ పథకం అమలుపై విమర్శలు గుప్పిస్తున్నారు.




కానీ రేవంత్ రెడ్డి ఎత్తు ఫలించడంతో రైతులు బిఆర్ఎస్ విమర్శలను పట్టించుకోవడం లేదు. పైగా రేవంత్ రెడ్డి తమకు ఒకేసారి రెండు లక్షలు రూపాయలు ఇస్తుంటే, కెసిఆర్ విమర్శలు చేయడాన్ని రైతులు కూడా తప్పుపడుతున్నారు. కనుక అపర చాణక్యుడినని విర్రవీగే కెసిఆర్‌పై రేవంత్‌ రెడ్డి ఈ ఒక్క పధకంతో మరోసారి రాజకీయంగా ఫైచేయి సాధించారనే చెప్పవచ్చు.