‘కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అంటూ జగన్ కు అనుకూలంగా ‘వ్యూహాలు’ వేసిన సినీ దర్శకుడు ఆర్జీవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గా నారా, నందమూరి కుటుంబాలను అవమానిస్తూ సినిమాలు తెరకెక్కించారు.
వంగవీటి అంటూ దేవినేని సినిమాను తెరకెక్కించి రెండు సామజిక వర్గాల మధ్య మరోసారి విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేసారు. వైసీపీ హయాంలో బాబూ, పవన్, లోకేష్ లను కించపరుస్తూ ఆయా నాయకుల అభిమానులను మానసికంగా వేధిస్తూ తగ్గేదెలా అంటూ ‘శపధాలు’ చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ‘దొరికేదేలా’ అన్నటుగా మాయమవుతున్నారు.
Also Read – ఈ ఏడాది ఏపీకి అంతా శుభం… పండుగ చేసుకోవలసిందే!
గతంలో ఆయన చేసిన అరాచకాలకు గాను నేడు విచారణ జరుగుతున్న నేపథ్యంలో విచారణకు హాజరుకాకుండా ఆర్జీవీ తప్పించుకు తిరుగుతున్నారు. నాడు సోషల్ మీడియా పోస్టులతో భయపెట్టిన వాడు నేడు పోలీసులను చూసి భయపడుతున్నాడు.
నాడు జగన్ ఇచ్చిన పరోక్ష సహకారంతో టీడీపీ, జనసేనలకు వ్యతిరేకంగా సినిమాలు తీయడమే కాదు ఆ సినిమాల ప్రమోషన్లలో కూడా ఆయా పార్టీల అధినేతలను ఉద్దేశించి అసహ్యంగా మాట్లాడిన ఆర్జీవీ నేడు జగన్ పట్టించుకోకపోవడంతో రక్షణ కోసం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ పొరుగు రాష్ట్రాలకు పారిపోతున్నారు.
Also Read – ఆర్జీవీ…’మెగా’ సెటైర్స్..!
వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా బాబు, పవన్ ను ఉద్దేశించి ఆర్జీవీ చేసిన వ్యాఖ్యల పై చర్యలు తీసుకోవాలంటూ ఏపీలోని ఒంగోలు పట్టణంలో నమోదైన కేసులకు గాను విచారణకు రాకుండా తప్పించుకుంటున్న ఆర్జీవీ కోసం హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారు ఒంగోలు పోలీసులు.
కాగా అక్కడ ఆర్జీవీ లేరు అనే సమాచారం అందడంతో ఆయన కోసం అక్కడే కాపుకాశారు ఏపీ పోలీసులు. అయితే నిన్న రామ్ గోపాల్ వర్మ, మళయాలం స్టార్ హీరో మోహన్ లాల్ తో కలిసి దిగిన ఫోటో ఒకటి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీనితో ఆయన అరెస్టు భయంతో కోయంబత్తూలో తలదాచుకుంటున్నారా.? లేక పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఈ ఫోటోను షేర్ చేసారా.? అనేది తెలియాల్సి ఉంది.
Also Read – అమరావతి కష్టాలు భోగి మంటలో కాలినట్టేనా.?
క్రియేటివ్ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చివరికి ఆ దర్శకుడు అనే టాగ్ లైన్ కు కూడా అనర్హుడిగా మిగిలారు. నాడు జగన్ రాజ్యంలో తమ పైశాచిక చర్యలతో ప్రత్యర్థి పార్టీల అధినేతల సహనాన్ని పరీక్షించిన ఆర్జీవీ, పోసాని, శ్రీరెడ్డి, బోరుగడ్డ, వర్రా రవీంద్ర, సజ్జల భార్గవ్ రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి ‘అన్న’ బిడ్డలంతా నేడు ఎప్పుడు ఎం జరుగుతుందా అనే భయం గుప్పిట్లో లభోధిబో మంటున్నారు.
ఇందుకు గాను తప్పైపోయింది మహా ప్రభో క్షమించండి అంటూ ఒకరు, ఇక తప్పు చేయను మన్నించండి సార్ అంటూ మరొకరు, చేసిన తప్పుకి మౌనమే ప్రాయశ్చిత్తం అంటూ ఇంకొందరు ఇలా జగనన్న పాలనలో రాజ్యమేలిన ఒక్కొక్కరు ఒక్కోలా కూటమి ప్రభుత్వంతో రాజీ భేరం చేస్తున్నారు.