RGV Video Reply

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకి ఏపీ పోలీసులు నోటీస్ జారీ చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. కానీ తానేమీ కేసులకు భయపడి పారిపోలేదని ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ పనితో బిజీగా ఉన్నానని, తాను మద్యలో వదిలేస్తే నిర్మాతకు నష్టం వస్తుందని అందుకే విచారణకు హాజరు కాలేకపోతున్నానని చెపుతూ ఓ వీడియో విడుదల చేశారు.

Also Read – ఐశ్వర్య రాజేష్..మరో అంజలి అవుతారా.?

దానిలో వర్మ కొన్ని ఆసక్తికరమైన ఆలోచింపదగ్గ ప్రశ్నలు వేశారు.

నేను ఏడాది క్రితం ఎవరినో విమర్శిస్తూ ట్వీట్స్ పెడితే, ఇప్పుడు ఏపీలో వేర్వేరు ప్రాంతాలలో ఉన్న ఇతరులందరికీ నాలుగైదు రోజుల వ్యవధిలో ఒకేసారి మనోభావాలు ఎలా దెబ్బ తిన్నాయి?

Also Read – శ్రీలక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్… ఎవరి కోసం?

నేను విమర్శించిన వారి మనోభావాలు దెబ్బ తింటే అర్దం చేసుకోవచ్చు. కానీ వారేమీ స్పందించలేదు. కానీ వారిపై నేను చేసిన విమర్శలకు ఇతరుల మనోభావాలు ఎలా దెబ్బ తిన్నాయి?వేరవరి మనోభావాలో దెబ్బ తిన్నాయని పిర్యాదు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఏమనుకోవాలి?వాటికి ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి?

రాజకీయ ఒత్తిళ్ళు లేదా మరో కారణంతోనే వారు తొందరపడుతున్నట్లు అర్దమవుతూనే ఉంది. అమెరికా, యూరప్ వంటి దేశాలలో కొన్ని ప్రభుత్వ వ్యవస్థలను ఆయుధాలుగా చేసుకొని ప్రత్యర్ధులని వేటాడటం జరుగుతుంటుంది. నాపై నమోదైన ఈ కేసులు, పోలీసుల హడావుడి అంతా చూస్తుంటే ఇప్పుడు మన దేశంలో కూడా అదే జరుగుతోందనిపిస్తోంది.

Also Read – ట్రంప్ రోకలి పోట్లు భరించాల్సిందే… తప్పు ఆయనది కాదు!

ఏడాది తర్వాత నాపై ఒకేసారి ఇన్ని కేసులు నమోదు చేశారు. హత్యలు, మానభంగాలు వంటి తీవ్రమైన నేరాలలో కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడానికి నెలలు, సంవత్సరాలు సమయం తీసుకుంటారు. కానీ నాదేమీ అంత అత్యవసరంగా విచారణ చేయాల్సిన కేసు కాదని నేను భావిస్తున్నాను. కానీ ఈ కేసు నమోదైన వారం రోజులలోనే నన్ను అరెస్ట్ చేసేయాలని పోలీసులు ఎందుకు ఆరాటపడుతున్నారు?

కారణాలు ఏవైనప్పటికీ పోలీసులు ఈవిదంగా చేయడం సర్వసాధారణమే. కానీ తమ చర్యలకు పర్యవసానాలు ఏవిదంగా ఉంటాయో కూడా ఆలోచించుకోవాలి కదా?అంటూ రాంగోపాల్ వర్మ ఓ పెద్ద వీడియో మెసేజ్ పోస్ట్ చేశారు.

రాంగోపాల్ వర్మ వాదన సహేతుకంగానే ఉందని చెప్పవచ్చు. కానీ ఆయన తన తెలివితేటలతో తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా అర్దమవుతూనే ఉంది.

ఆయనకు తాను చేసింది తప్పు అని తెలుసు కనుకనే ఎన్నికలలో వైసీపీ ఓడిపోగానే ‘ఇకపై రాజకీయాలపై అభిప్రాయాలు వ్యక్తం చేయను,’ అని అన్నారు.

ప్రభుత్వాలు వ్యవస్థలను ఆయుధాలుగా వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని వర్మ ఆరోపించారు. కానీ వ్యవస్థలు-వాటి పనితీరు గురించి ఇంత లోతైన అవగాహన ఉన్నప్పుడు, ప్రభుత్వం మారితే ఇటువంటివి జరుగుతాయని తెలిసి ఉన్నప్పుడు సంయమనంగా వ్యవహరించి ఉండొచ్చు కదా?

చేయకూడని తప్పులన్నీ చేసి కేసులు నమోదైతే అన్యాయం, అక్రమం, రాజకీయ కక్ష సాధింపు అని రాజకీయ నాయకులు అనడం సహజం. కానీ మేధావీ వర్గానికి చెందిన వర్మ కూడా అలాగే వాదిస్తుండటాన్ని ఏమనుకోవాలి?

కేసులంటే భయం లేనప్పుడు, తప్పు చేయలేదని నమ్ముతున్నప్పుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్‌ ఎందుకు వేసిననట్లు? అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళిన్నట్లు?




వైసీపీలో సినీ నటుడు అలీ కూడా ఉన్నారు. కానీ ఆయన ఏనాడూ ఎవరి మీద నోరు పారేసుకోలేదు. అందువల్లే నేడు ప్రభుత్వం మారినా ఎటువంటి ఇబ్బందీ లేకుండా హాయిగా జీవించగలుగుతున్నారు కదా?కానీ వర్మకే ఎందుకీ ఖర్మ?అంటే ఖర్మ ఫలమే కదా ఇది?