251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ఇస్తామంటూ సంచలనం సృష్టించిన ‘రింగింగ్ బెల్స్’ డైరెక్టర్ మోహిత్ గోయల్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 16 లక్షల మేర రింగింగ్ బెల్స్ సంస్థ తమకు చెల్లించాలంటూ ఆయామ్ ఎంటర్ ప్రైజెస్ చేసిన ఫిర్యాదు మేరకు, మోహిత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ప్రస్తుతం నిజాలను బయటపెట్టించే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
రింగింగ్ బెల్స్ కు చెందిన లింక్డ్ ఇన్ వెబ్ సైట్ లో మోహిత్… తాను అమిటీ యూనివర్శిటీలో ఎంబీఏ చేశానని పేర్కొన్నాడు. అయితే తాను చదివింది కేవలం ఎనిమిదో తరగతేనని, అది కూడా పాసవ్వలేదని మోహిత్ పోలీస్ విచారణలో చెప్పాడు. తాను ఇంగ్లీష్ లో మాట్లాడేందుకు స్పీకింగ్ కోర్స్ చేశానని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఈ కేసులో పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



