రిషబ్ శెట్టి షాక్: కాంతారా హీరోయిన్ రుక్మిణి & రాజ్ బి శెట్టి అన్‌ఫాలో!

Rishab Shetty unfollowing Kantara co-stars Rukmini Vasanth and Raj B Shetty sparks controversy

కాంతారా సూపర్ స్టార్ రిషబ్ శెట్టి తన సన్నిహిత సహనటులను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం కన్నడ ఇండస్ట్రీలో పెద్ద సంచలనం సృష్టించింది. ‘కాంతార: చాప్టర్-1’ విజయం అనంతరం రిషబ్ తన సన్నిహితుడు, సహనటుడు రాజ్ బి శెట్టి మరియు సినిమాలో హీరోయిన్‌గా నటించిన రుక్మిణి వాసంత్ను అన్‌ఫాలో చేశారు.

ఇంతేకాకుండా, ‘కాంతారా’ సినిమా అధికారిక ఖాతా మరియు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారిక ఖాతాను కూడా రిషబ్ అన్‌ఫాలో చేశారు. అయితే హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ను మాత్రం ఇంకా ఫాలో చేస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

రాజ్ బి శెట్టి మరియు రుక్మిణి వాసంత్ ఇప్పటికీ రిషబ్‌ను ఫాలో చేస్తున్నారు. కానీ రిషబ్ ఒక్కరే ఈ దూరం పాటించడం గురించి ఫ్యాన్స్ మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది.
RRR ట్రయోలో గొడవ?

రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి, రాజ్ బి శెట్టి త్రయం (RRR) కన్నడ సినిమా పరిశ్రమలో ఎప్పుడూ బలమైన స్నేహితులుగా పేరు పొందారు. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య స్నేహభంగం ఉన్నట్టు గాసిప్స్ వస్తున్నాయి. ‘కాంతారా చాప్టర్-1’ ప్రమోషన్స్‌లో రాజ్ బి శెట్టి, రక్షిత్ శెట్టి గైర్హాజరీ కూడా ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసింది.

రుక్మిణి వాసంత్ ఇటీవల తన పాత్రకు సంబంధించి రిషబ్‌కు ధన్యవాదాలు తెలిపినా, సోషల్ మీడియాలో ఈ అన్‌ఫాలో వ్యవహారం ఆసక్తి రేపుతోంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ లేదా ఇతర కారణాల వల్ల ఈ దూరం ఏర్పడిందా అనేది ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం.

ఇప్పటివరకు రిషబ్ శెట్టి లేదా హోంబలే ఫిల్మ్స్ తరఫున ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. రిషబ్ ప్రస్తుతం తన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’ కోసం సన్నాహాలు చేస్తున్నారు.

ఈ అన్‌ఫాలో వ్యవహారం వెనుక నిజమైన కారణం ఏమిటో త్వరలో తెలిసే అవకాశం ఉంది!

ADVERTISEMENT
Latest Stories