పవన్ కళ్యాణ్ పై దుష్ప్రచారం చేస్తుంది ఎవరు?

Rumourrs Pawan Kalyan blackmailing Chandrababu Naidu for chiranjeeviజనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలలో యాక్టీవ్ అయ్యేకొద్దీ ఆయన మీద విమర్శల హోరు ఎక్కువ అవుతుంది. తాజాగా ఒక పత్రిక వెల్లడించిన వార్త ప్రకారం తన అన్నయ్య చిరంజీవిని రాజ్యసభకు తిరిగి నామినేట్ చెయ్యడానికే నిజనిర్ధారణ కమిటీ పేరుతో చంద్రబాబు నాయుడును బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించింది.

ADVERTISEMENT

అదే సమయంలో చిరంజీవికి అంతగా రాజకీయంగా జనాకర్షణ లేదని, ఆయన బదులు పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా ఆప్తుడైన జయప్రకాష్ నారాయణకు ఇద్దామని చంద్రబాబు ఆయనను ఒప్పించినట్టు ఆ రిపోర్టు చెబుతుంది. అయితే ఈ వార్తను తెలుగు దేశం వర్గాలు ఖండిస్తున్నాయి.

తెలుగు దేశంకు వచ్చే రాజ్యసభ సీట్లకు ఇప్పటికే హై డిమాండ్ ఉందని బయట వారికి ఇచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. ఇటువంటి కధనాలు ద్వారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి పని చేస్తున్నారని చాటి చెప్పే ప్రయత్నం అని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పై దుష్ప్రచారం చేస్తుంది ఎవరు?

ADVERTISEMENT
Latest Stories