వైఎస్సార్ కాంగ్రెస్ లోని ధీటైన వాయిస్ కు కరోనా?

rumours Ambati Rambabu COIVD -19ఆంధ్రప్రదేశ్ లో ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఇప్పటివరకు దాదాపుగా డజన్ నేతలకు కరోనా సోకింది. నిన్ననే ఆ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఇది ఇలా ఉండగా… మరో సీనియర్ నేత, ఎమ్మెల్యే కూడా కరోనా బారిన పడ్డారు.

ADVERTISEMENT

సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కరోనా పాజిటివ్ గా తేలారని సమాచారం. ఇప్పటిదాకా దీనిని వైఎస్సార్ కాంగ్రెస్ అధికారికంగా ధృవీకరించలేదు. దీనితో ఆయన ఎలా ఉన్నారు? ఎక్కడ చికిత్స పొందుతున్నారు అనే విషయం బయటకు పొక్కలేదు. అయితే ఒక మీడియా సంస్థ మాత్రం ఆయన స్వాబ్ టెస్టులో భిన్నమైన ఫలితాలు వెలుగు చూశాయని తెలిపింది.

సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన టెస్టులో ఒకసారి నెగటివ్.. మరోసారి చేసిన పరీక్షలో అంబటికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పాజిటివ్ వార్త గనుక నిజమైతే… అధికార పార్టీ తమ పార్టీలోని ఒక మంచి వక్త సర్వీసులను అధికారపార్టీ దీని కారణంగా కొన్ని రోజులు కోల్పోయే అవకాశం ఉంది.

ఐదు రోజులు క్రితం కూడా ఆయన టీడీపీ ఎంపీల ఢిల్లీ పర్యటన మీద ప్రెస్ మీట్ పెట్టి విరుచుకుపడ్డారు. ఇది ఇలా ఉండగా… ఆంధ్రప్రదేశ్ లో కరోనా కోరలు చాచుతుంది. రోజుకు దాదాపుగా ఐదు వేల మంది కరోనా బారిన పడుతున్నారు. 50-60 మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories