రామోజీరావుతో పెట్టుకున్నా ఇబ్బందే… అమిత్ షాతో పెట్టుకున్నా ఇబ్బందే…

Ramoji Rao - amit shahభారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం రామోజీరావు ద్వారా తెలుగుదేశం మంతనాలు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతో రామోజీరావు గంటసేపు మంతనాలు జరిపారని అన్నారు.తెలుగుదేశం, బిజెపి మద్య సయోధ్య కోసమే ఆ మంతనాలా అని ఆయన ప్రశ్నించారు

అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మొత్తం విమర్శలో ఎక్కడా రామోజీరావు పేరు ఎత్తకుండా విమర్శ చెయ్యడం. రామోజీరావుతో పెట్టుకోవడం ఎందుకు అనుకున్నారేమో బహుశా. అయితే వైకాపా విమర్శ కొంత పేలవంగా కనిపిస్తుంది. నిజానికి రామోజీరావు అమిత్ షాను కలవలేదు. అమిత్ షానే రామోజీరావు అప్పాయింట్మెంట్ కోరి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి మరి కలిశారు.

ADVERTISEMENT

ఆ విమర్శ బట్టి చంద్రబాబుతో సయోధ్య కుదర్చమని అమిత్ షానే అడగడానికి వెళ్ళి ఉండాలి. అలా చెప్పే ధైర్యం కూడా వైకాపాకు ఉండదు బీజేపీ నుండి ఎక్కడ ఇబ్బందో అని. ఇన్ని ఇబ్బందుల మధ్య అసలు విషయం ప్రతిపక్ష పార్టీ ఎత్తకుండా ఉంటే పోయేది కదా?

ADVERTISEMENT
Latest Stories