ట్రిపుల్ ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ మరో సినిమాని ఇంకా స్టార్ట్ చెయ్యలేదు. కొరటాలతో ఎన్టీఆర్ ౩౦ సినిమా ఎప్పుడు పట్టాలెక్కబోతుందనే దాని మీద ఇంకా క్లారిటీనే లేదు. ఇక హీరోయిన్ సంగతి అడగనేవద్దు. ఇప్పుడు కొత్తగా కీర్తి సురేష్, ఎన్టీఆర్ ౩౦ సినిమా లో హీరోయిన్ పాత్రని తిరస్కరించిందని ఒక పుకారు చక్కర్లు కొడుతున్నది.
అసలిందులో నిజమెంతుందో అనేది ఒక నిమషం పక్కన పెడితే ..ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో సినిమాలో ఆఫర్ వస్తే, చిన్న చిన్న హీరోలతో నటిస్తున్న కీర్తి సురేష్ లాంటి హీరోయిన్ వదులుకునే అవకాశం ఉందా ? అన్న ప్రశ్న మన మైండ్ లోకొస్తుంది.కీర్తి సురేషే కాదు ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతులేసి ఒప్పుకుంటది. పోనీ ఈ మధ్య కీర్తి సురేష్ చేతి నిండా ఆఫర్లు ఉన్నాయా అంటే అవి కూడా లేవు. నాని తో దసరా సినిమా తప్ప కీర్తి సురేష్ కి చెప్పుకోదగ్గ సినిమాలేమి లేవ్.
Also Read – వంశీ జైలుకి… వైసీపీ కార్యకర్తలు సైలంట్?
మహానటి సినిమా తరువాత ఆమె చేసిన సినిమాలన్నీ సరిగ్గా ఆడలేదు. ఆఫర్లు తగ్గినపుడు అందరి హీరోయిన్లలాగానే కీర్తి సురేష్ కూడా గ్లామర్ షో మొదలెట్టింది. పవన్ సరసన చేసిన అజ్ఞ్యాతవాసి, మహేష్ బాబు సరసన చేసిన సర్కారువారి పాట ఆమెకు ఏమాత్రం కలిసి రాలేదు. పైగా పెద్ద హీరోల సరసన కీర్తి చేసిన సినిమాలు ప్లాప్ అవుతాయని అపకీర్తి తెచ్చిపెట్టింది.
ఇలాంటి పరిస్థితుల్లో బంగారం లాంటి ఎన్టీఆర్ ౩౦ ఆఫర్ వస్తే, కీర్తి సురేషే కాదు, ఏ హీరోయిన్ కూడా వదులుకోదు. కనుక ఇటువంటి పుకార్లు బుర్ర తక్కువున్నోళ్లే నమ్మాలి. కొరటాల చెప్పిన స్క్రిప్ట్ కి ఫైనల్ నేరేషన్ లాక్ అయ్యాకే సెట్స్ కి వెళదామని కరాఖండి గా ఎన్టీఆర్ చెప్పేసాడని టాక్.