బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన “సాక్ష్యం” సినిమా ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా మూవీ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ‘లక్ష్యం, లౌక్యం’ ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గ్రాండ్ గా తెరకేక్కిందన్న విషయం ధియేటిరికల్ ట్రైలర్ ఇప్పటికే స్పష్టం చేయగా, ఈ మేకింగ్ వీడియో మరోసారి ధృవీకరించింది.
అద్భుతమైన లొకేషన్స్ లో బడ్జెట్ కు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్న విషయాన్ని మేకింగ్ వీడియో స్పష్టం చేసింది. ఏ అగ్ర హీరో సినిమాకు తగ్గని రీతిలో ప్రొడక్షన్స్ వాల్యూస్ ఉన్నాయి కానీ, ఈ మేకింగ్ వీడియో క్వాలిటీ చాలా తక్కువగా ఉండడం విశేషం. సినీ పరిశ్రమకు సంబంధించి యూ ట్యూబ్ లోకి అప్ లోడ్ అయ్యే ఏ వీడియోలైనా, విజువల్ గా 4కే గానీ, లేదా దాని క్రింద స్థాయిలో గానీ ఉంటున్నాయి.
కానీ ఈ మేకింగ్ వీడియోను కేవలం 360 పిక్సెల్స్ తో రిలీజ్ చేయడం ఊహించినది కాదు. దీంతో లొకేషన్స్ లో కనపడుతున్న క్వాలిటీని ఈ వీడియో సరిగా అందించలేకపోయింది. సాంకేతిక పరంగా లోపమో లేక చిత్ర యూనిట్ ఇంత తక్కువ క్వాలిటీలో మేకింగ్ వీడియోను రూపొందించిందో గానీ, సినిమాలో ఉన్న నాణ్యతను ఆశించిన స్థాయిలో ఈ మేకింగ్ వీడియో ద్వారా చూపించలేకపోయింది.