క్రికెట్ దేవుడు సచిన టెండూల్కర్, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలు నేటి ఉదయం తిరుమలలో కలిశారు. స్వామి వారి దర్శనానికి వచ్చిన వీరంతా, వీఐపీ బ్రేక్ దర్శనానికి ముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లారు. గత రాత్రి వీరు తిరుమలకు రాగా, అధికారులు స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందించారు.
ADVERTISEMENT
వీరితో పాటు నిర్మాత అల్లు అరవింద్, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు కూడా ఉన్నారు. ఆలయం నుంచి బయటకు వస్తున్న వేళ మీడియా కోరిక మేరకు సెలబ్రిటీలంతా కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ‘సచిన్’ బయోపిక్ సినిమా త్వరలో విడుదల కానుండగా, తన 150వ చిత్రం కోసం మెగాస్టార్ చిరంజీవి రెడీ అవుతున్నాడు. అలాగే హీరో నాగార్జున దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నేతృత్వంలో ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా కోసం సన్నద్ధమవుతున్నాడు.
ADVERTISEMENT



