దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కిన “ఓం నమో వేంకటేశాయ” సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నా, నాగ్ అభినయం సినీ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ప్రీమియర్ షోను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి సైతం, సెకండాఫ్ లో నాగ్ ప్రదర్శించిన అభినయం పట్ల ముగ్ధులైన విషయం తెలిసిందే. ఒక్క చిరునే కాదు, సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది హీరోలు నాగార్జున నటనకు ఫిదా కాగా, తాజాగా ఆ జాబితాలోనే మరో మెగా హీరో నిలిచారు.
“ఓం నమో వేంకటేశాయ” సినిమాను మాటల్లో వర్ణించలేమని, నాగార్జున సర్… రామ హాథిరాం చరిత్రలో నిలిచిపోయినట్టు, తెలుగు ప్రజలకు భక్తుడు అంటే మీరే ఇక నుండి అని” మెగా హీరో సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయ పడ్డారు. ఎలాంటి ఈగోలు లేకుండా తన భావాలను వెల్లడించడంలో మెగా కాంపౌండ్ లో సాయిధరమ్ ప్రధమంగా ఉంటారన్న విషయం తెలిసిందే. అందుకే ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా చూసిన వెంటనే తన ఉద్దేశాన్ని సోషల్ మీడియా వేదికగా స్పష్టంగా వెల్లడించారు.



