మెగా హీరోగా అడుగుపెట్టి, తనకంటూ సొంత ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవడంలో ఎంతో కొంత సక్సెస్ అయిన సాయిధరమ్ తేజ్ ఈ నెల 24వ తేదీన “విన్నర్” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. థమన్ స్వరపరిచిన బాణీలు విడుదలై పర్వాలేదనిపించే విధంగా ఉందనే టాక్ రావడంతో, సంగీతం పరంగా ఒక మెట్టు ఎక్కిన ఈ సినిమా విడుదల కావడానికి అన్ని ఫార్మాలిటిస్ ను పూర్తి చేసుకుంది. ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘యు/ఎ’ సర్టిఫికేట్ ను మంజూరు చేసింది.
ఇదిలా ఉంటే, ‘విన్నర్’ బాటలోనే మరో కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన మంచు మనోజ్ “గుంటూరోడు” సినిమా కూడా సెన్సార్ ను పూర్తి చేసుకుని, ‘యు/ఎ’ సర్టిఫికేట్ ను తెచ్చుకుంది. రెండు కమర్షియల్ సినిమాలకు కూడా ‘యు/ఎ’ రావడంతో చిత్ర యూనిట్లు ఖుషీగా ఉన్నాయి. గ్యారెంటీ సక్సెస్ కావాల్సిన మంచు మనోజ్, తన ‘గుంటూరోడు’ను మార్చి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రెండు సినిమాల ట్రైలర్స్ కూడా రెగ్యులర్ కమర్షియల్ హంగులతోనే నిండుకుని ఉండడం మరో విశేషం.



