టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా, ఇతర తారాగణం ఎంపికలో దర్శక నిర్మాతలు ఉన్నారట.

ఈ సినిమాలో మహేష్ బాబు చెల్లెలి పాత్ర అత్యంత కీలకమట. అందుకోసం ప్రముఖ హీరోయిన్ ‘హైబ్రిడ్ పిల్ల’ సాయిపల్లవిని ఎంపిక చేసినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేస్తోన్న టాక్. అయితే దీనికి సాయిపల్లవి ఓకే చెప్పిందా లేదా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ఎందుకంటే ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సోదరీమణిగా నటించడానికి సాయి పల్లవి నో చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవల ‘లవ్ స్టోరీ’ ఈవెంట్ లో ఏకంగా మెగాస్టార్ చిరంజీవే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. అయితే అది రీమేక్ సినిమా కావడంతో నో చెప్పానని సాయిపల్లవి తెలిపింది.

త్రివిక్రమ్ – మహేష్ కాంబో మూవీ రీమేక్ కాదు గానీ, సూపర్ స్టార్ సరసన హీరోయిన్ గా నటిస్తే వచ్చే గుర్తింపుకు, సోదరి పాత్రలో లభించే గుర్తింపు వేరు కదా! అందులోనూ ఈ సినిమాలో పూజా హెగ్డే వంటి హాట్ హీరోయిన్ నటిస్తుండడంతో, ఎంతో బలంగా ఉంటే తప్ప ఈ సిస్టర్ రోల్ కు సాయిపల్లవి నుండి గ్రీన్ సిగ్నల్ లభించదు.

గతంలో మహేష్ బాబు ‘అర్జున్’ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రియా కంటే సోదరీమణిగా నటించిన కీర్తి రెడ్డికే ఎక్కువ పేరొచ్చింది. ఒకవేళ ఆ స్థాయి క్యారెక్టర్ వస్తే, సాయిపల్లవి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకపోవచ్చు కూడా! అభినయాన్ని ప్రదర్శించగల బ్యూటీ కావడం సాయిపల్లవికి ఉన్న అదనపు ఆకర్షణ.