సాక్షి మీడియాకు సిగ్గుచేటు!

Sakshi-Nara-Lokeshఅందరిదీ ఓ దారయితే… నాదొక్కరిదే ఒక దారి… అన్నాడంట వెనకటికొకడు. జగన్ మీడియా సంస్థ అయిన సాక్షిది కూడా అదే దారంటూ నారా లోకేష్ చెప్పకనే చెప్పారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుపై సదరు సంస్థకు – ఏపీ సర్కార్ కు మధ్య ఒప్పందాలు కుదరడంతో, సదరు అంశాన్ని జాతీయ దినపత్రికలతో సహా అన్ని దినపత్రికలు హెడ్ లైన్స్ లో వేసాయి, ఒక్క సాక్షి తప్ప!

దీనినే ఎద్దేవా చేస్తూ నారా లోకేష్ తాజాగా ఓ ట్వీట్ చేసారు. సాక్షికి మాత్రమే కనిపించని అమరావతి అభివృద్ధి అంటూ హెడ్ లైన్స్ లో ప్రచురించిన దినపత్రికలు ఓ వైపు, కేవలం ఓ చిన్న న్యూస్ ఐటెంగా మాత్రమే ప్రచురించిన సాక్షి వార్తను మరో వైపు ఉంచుతూ… ఇది సాక్షికి సిగ్గుచేటు చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో అసలేం జరుగుతుందో వారికి తెలియదంటూ సదరు మీడియా తీరుతెన్నులను ఎత్తిచూపారు.

ADVERTISEMENT

నారా లోకేష్ దీనినైతే ఎత్తి చూపించారు గానీ, సాధారణంగా సాక్షి మీడియా అనుసరించే విధానం ఇదేనన్న విషయం సదరు పత్రికను గానీ, మీడియా సంస్థను గానీ ఫాలో అయితే ఇట్టే తెలిసిపోతుంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందనిపిస్తే ఏ వార్తను ప్రచురించరు, ప్రసారం చేయరన్న సంగతి తెలియనిది కాదు. ముఖ్యమైన విషయాలు కనీసం ప్రజలకు తెలియాలన్న నైతికతను కూడా పాటించడం లేదనేది లోకేష్ గారి భావనేమో!

ADVERTISEMENT
Latest Stories