LOL : సాక్షి ప్రసారాలపై నెటిజన్ల కామెంట్స్!

SakshiTV Reportఅత్యుత్సాహానికి, అవాస్తవానికి అతి దగ్గరగా కధనాలను ప్రసారం చేసే ఛానల్ గా నాడు వైఎస్ స్థాపించిన ‘సాక్షి’ మీడియా ప్రసారాలు ఉంటాయని ఇప్పటికే ప్రజల్లో ఓ ముద్ర పడిపోయింది. వైఎస్ హెలికాఫ్టర్ కూలిన ఘటనలో మరుసటి రోజు రక్షక దళం హెలికాఫ్టర్ కూలిపోయింది, ఎవరూ బ్రతికే అవకాశం లేదని స్పష్టంగా చెప్పగా, అదే వివరాన్ని అన్ని మీడియా ఛానల్స్ ప్రసారం చేసాయి… ఒక్క సాక్షి తప్ప! నాడు సదరు ఛానల్ కు మాత్రం వైఎస్ క్షేమంగా ఉన్నారు, చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి అంటూ ప్రసారం చేసి… తర్వాత నాలుక కరుచుకుంది.

అయితే సాక్షి ప్రసారాలను చూసి ఆశగా ఎదురుచూసిన ప్రజలకు చివరికి వైఎస్ విగతజీవిగా ఎదురుకావడంతో ‘సాక్షి’ ప్రసారాలపై మండిపడ్డారు. ఇలా అత్యంత కీలకమైన విషయాలలోనే జగన్ మీడియా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు రవేస్తుంటే… స్వార్ధ రాజకీయ లబ్దితో వర్తమాన రాజకీయాల్లో ఇంకెంత సమాచారం అందిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇటీవల ప్రసారమవుతున్న సాక్షి కధనాలు వీక్షకులకు మరింత హాస్యాన్ని పంచుతుండడం విశేషం.

ADVERTISEMENT

అలాంటి జాబితాలోనిదే ఈ ఫోటో. 2016 సెప్టెంబర్ 6వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడంటూ ప్రసారం చేసిన కధనం నెటిజన్ల పాలిట వరమయ్యింది. ఈ ఫోటోను షేర్ చేసుకుంటూ నవ్వుకోవడం చూపరుల వంతవుతోంది. సహజంగా పొరపాట్లు సర్వ సాధారణమే అయినా… సాక్షి మీడియా చేసే పొరపాట్లు మాత్రం చూసే వారికి కాస్తంత ఎక్కువగా హాస్యాన్ని పండిస్తుంది. జగన్ మీడియానా… మజాకా..!

ADVERTISEMENT
Latest Stories