గత కొంతకాలంగా మీడియా వర్గాల్లోనూ, సినీ జనాలలోనూ హాట్ టాపిక్ గా మారిన అక్కినేని వారసుడి యవ్వారం ఓ కొలిక్కి వచ్చిందా? ఇదిగో అదిగో అంటూ చక్కర్లు కొట్టిన చైతూ – సమంతలు ఒక్కటి కావడానికి రంగం సిద్ధమైందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. వీరిద్దరి వివాహం డిసెంబర్ లో జరగబోతుందన్న వార్తలు గతంలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను తాజాగా సవరిస్తూ…
డిసెంబర్ కాదు… మరో మూడు నెలలు ముందుకు జరిపినట్లయితే… సెప్టెంబర్ లో నాగచైతన్య – సమంతల వివాహానికి ముహూర్తం ఖరారైందన్న సమాచారం హల్చల్ చేస్తోంది. దీనికి వెన్యూ కూడా ఫిక్స్ అయ్యిందని, హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ శ్యామ్ – చైతూ పరిణయానికి వేదిక కాబోతోందని తెలుస్తోంది. సెప్టెంబర్ 23వ తేదీన అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుకను జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్తను అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయాట.
బహుశా ఈ ప్రకటనను ‘కుందనపు బొమ్మ’ సమంతతో పాటు, అక్కినేని ఫ్యామిలీ కూడా ధృవీకరించనుందని టాక్. పుకార్లకు స్వస్తి పలకాలని భావిస్తున్న తరుణంలో అభిమానులకు తీపి కబురు అందనుండడం మిక్కిలి సంతోషకరమైన వార్తే కదా! ఇప్పటికే సమంత పరోక్షంగా తన ట్వీట్ల ద్వారా ఇవ్వాల్సిన సందేశాన్ని ఇస్తూనే ఉందని నెటిజన్లు డిక్లేర్ చేస్తున్నారు.



