సంధ్యా థియేటర్ ఎఫెక్ట్: ఏపీకి తరళిన ఈవెంట్స్..!

game-changer-pre-release-event

పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటన సినీ ఇండస్ట్రీని ఎంతలా భయపెట్టిందో, మరెంతలా జాగ్రత్త పెట్టిందో నిన్న జరిగిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ లో స్పష్టంగా కనిపించింది.

నాడు జరిగిన దుర్ఘటనకు గాను నేడు అభిమనులకు దూరంగా, బహిరంగ వేదికల మీద కాకుండా నాలుగు గదుల మధ్య ఒక ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించబడింది. RRR తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ కావడంతో మెగా ఫాన్స్ ఈ సినిమా పట్ల, ఈ మూవీ ప్రమోషన్స్ పట్ల తీవ్ర ఆసక్తిని కనపరుస్తారు.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమాలకు హాజరై తమ అభిమాన హీరోని దగ్గర నుంచి చూసి ఆనందించాలని అభిమానులు ఆశపడతారు. అయితే వారి ఆశలకు, ఆనందానికి తాత్కాలికంగా బ్రేకులు పడినట్టే అనిపిస్తుంది. సినీ ఇండస్ట్రీకి కానీ, తెలంగాణ ప్రభుత్వానికి ఈ ఘటన నుంచి బయటకు రావడానికి కొంత సమయం అవసరమని తెలుస్తుంది.

మరి అప్పటి వరకు హైద్రాబాద్ లో సినీ ఈవెంట్ అంటే ప్రేక్షుకులుగా అభిమానుల కంటే పోలీసులే ఎక్కువగా కనిపిస్తారా అనిపిస్తుంది. ఇలా అభిమానుల భద్రతా సమస్యల కారణంగానే తారక్ ‘దేవర’ సినిమా ప్రమోషన్స్ రద్దయ్యి ఎన్టీఆర్ అభిమానులను నిరాశ పరిచేలా చేసాయి, నొప్పించాయి కూడా. అయితే ఇపుడు చెర్రీ ఫాన్స్ వంతు వచ్చింది అంతే.

అయితే ఇక్కడ తెలంగాణలో కానిది అక్కడ ఏపీలో నిర్వహించేందుకు మూవీ టీం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఏపీలోని రాజమండ్రి కేంద్రంగా నిర్వహించనుంది చిత్ర యూనిట్. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారంటూ మూవీ టీం ప్రకటించింది.

మరి ఏపీలో జరగబోతున్న ఈ మూవీ సెలబ్రేషన్స్ మెగా అభిమానుల ఆకలి తీరుస్తాయనే చెప్పాలి. ఇక బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ ప్రమోషనల్ ఈవెంట్ కూడా ఏపీలోనే నిర్వహించేలా ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. ఇక వెంకీ మామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఏపీకి వస్తారేమో లేదో చూడాలి. ఇలా సంధ్యా ధియేటర్ ఘటన ఎఫెక్ట్ తో సినీ ఈవెంట్స్ ఏపీలో తరళి వస్తున్నాయి. ఇక్కడి ప్రేక్షకులకు ఆ అనుభూతులను పంచుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories