ఈ సంక్రాంతికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే, అంటే అటు HMPV వైరస్ ప్రభావం కానీ, ఇటు తెలంగాణ రాజకీయాలలో జరుగుతున్న మార్పుల పరిణామాలు కానీ అన్ని సక్రంగా ఉంటే జనవరి 10 న చెర్రీ గేమ్ ఛేంజర్ తో మొదలుకాబోతున్న సినీ సంక్రాంతి హడావుడి జనవరి 14 వెంకీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కొనసాగుతుంది.
అయితే ఈ సంక్రాంతికి విడుదలవుతున్న ఈ మూడు సినిమాలలోనూ హీరో, దర్శకుల కాంబో చూడడానికి ఆసక్తి కరంగా ఉంది. గేమ్ ఛేంజర్ ఈ మూవీ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్. ఇక్కడ సీనియర్ దర్శకుడు కుర్ర హీరో ని డైరెక్ట్ చేస్తున్నారు.
Also Read – అక్కడ కవిత.. ఇక్కడ గుడివాడ సేమ్ టూ సేమ్!
ఇక జనవరి 12 న రాబోతున్న సీనియర్ హీరో బాలయ్య డాకు మహారాజ్ ను కుర్ర దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈయన గత ట్రాక్ట్ రికార్డు చూసినా మాస్ హీరో రవితేజ, మెగా స్టార్ చిరంజీవి వంటి సీనియర్ హీరోలే దర్శనమిస్తున్నారు.
అలాగే సంక్రాంతికి వస్తున్నాం అంటూ జనవరి 14 న వస్తున్న మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా మరో యువ దర్శకుడు అనిల్ రావి పూడి నే నమ్ముకున్నారు. అనిల్ గత సినిమాలు చూసుకున్నా F2 , F3 అంటూ వెంకీ, వరుణ్ తో కలిసి సీనియర్, జూనియర్ కాంబోలో హిట్స్ అందుకుని, బాలయ్య, శ్రీలీల వంటి కాంబోలతో విజయాలు సొంతం చేసుకున్నారు.
Also Read – ‘ముద్రగడ’ పోయి…’జోగయ్య’ వచ్చారా.?
ఇలా సీనియర్ హీరోలు వెంకీ, బాలయ్య యువ దర్శకులైన అనిల్, బాబీ లను ఎంచుకుంటే, యూత్ ఫాలోయింగ్ ఉన్న రామ్ చరణ్ సీనియర్ దర్శకుడైనా శంకర్ కు అవకాశం ఇచ్చారు. ‘అన్ ప్రెడిక్టబుల్’ గా ఉన్న ఈ కాంబోలో ప్రేక్షకులను ‘సంక్రాంతి వస్తున్నాం’ అంటూ థియేటర్లకు రప్పించే ఆ ‘మైకేల్ జాక్సన్’ ఎవరో లెట్స్ వెయిట్ అండ్ సీ.