వెండితెరపై వెలవెలబోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్ధార్ గబ్బర్ సింగ్,” బుల్లితెరపై హంగామా చేసేందుకు సిద్ధమవుతోంది. మరికొద్ది గంటల్లో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ బుల్లితెరపై ప్రత్యక్షం కానుంది. దీంతో తమ అభిమాన హీరో చేసే రచ్చ కోసం పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మా టెలివిజన్ లో ప్రసారం కానున్న ఈ సినిమా సరికొత్త టీఆర్పీ రేటింగ్స్ ను నమోదు చేస్తుందేమో చూడాలి.
‘బాహుబలి, శ్రీమంతుడు’ సినిమాలు సాధించిన టీఆర్పీ రేటింగ్స్ తర్వాత, మరే చిత్రం బుల్లితెరపై పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. దీంతో పవర్ స్టార్ అయినా టీఆర్పీ రేటింగ్స్ విషయంలో తన పవర్ ను చూపిస్తారేమోనని ట్రేడ్ పరిశీలకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు పవన్ స్వయంగా కధ అందించగా, దర్శకుడు పేరు బాబీగా పడింది. సినిమా టాక్ ఎలా ఉన్నా, దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ప్రజాధరణకు నోచుకున్న విషయం తెలిసిందే.



