Sarkaru Vaari Paata - Mahesh Babu - character‘కళావతి’ సాంగ్ సెన్సేషనల్ హిట్ తో అభిమానులతో పాటు ప్రస్తుతం చిత్ర యూనిట్ అంతా ఖుషీగా ఉంది. ఆ క్రమంలో ఈ పాటను రచించిన అనంత శ్రీరామ్ ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ పాట వచ్చే సందర్భం గురించి అడుగగా, దానిని వివరించలేనని, పరోక్షంగా సినిమాలోని మహేష్ క్యారెక్టర్ ను రివీల్ చేసారు.

Also Read – అందరూ విరాళాలు ఇస్తుంటే జగన్‌…

అమ్మాయి, ప్రేమ, రొమాన్స్… ఇలాంటి పదాలకు గానీ, అలాంటి విషయాలకు గానీ ఏ మాత్రం పరిచయం లేని రగ్గడ్ గా పొగరుబోతుగా తిరిగే హీరోకు, అనుకోని సందర్భంలో ఓ అమ్మాయి పరిచయం అవ్వడమే కాకుండా, ఆ అమ్మాయి హగ్ ఇవ్వగానే షాక్ కు గురైన హీరో భావన ‘కళావతి’ పాటలోని పల్లవులుగా అనంత చెప్పుకొచ్చారు.

సాధారణంగా పేజీ 3 సంస్కృతిలో పెరిగిన వారికి హగ్ లు షేక్ హ్యాండ్ ఇచ్చినంత ఈజీ, కానీ ఆడ వాసనే లేని అబ్బాయికి ఓ కౌగిలింత వస్తే ఎలా ఉంటుంది? అనే దానికి ‘కళావతి’ పాట వర్ణన ఉంటుందని అన్నారు. ఈ సినిమాలో ‘కళావతి’ పాటతో పాటు మరో మూడు పాటలను రచించానని, ఒకటి ఇంట్రడక్షన్ సాంగ్, మెలోడీ డ్యూయెట్, బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ను రాసినట్లుగా అనంత పేర్కొన్నారు.

Also Read – కృష్ణ శాంతించింది… గోదారి పొంగింది

సినిమాలో మొత్తం 5 పాటలు ఉంటాయని, మరో పాటను ఎవరు రాస్తున్నారనేది తెలియదని చెప్పిన అనంత, ‘కళావతి’ పాట కోసం మొత్తం 40కి పైగా పల్లవులను సిద్ధం చేసి చివరికి మీరు వింటున్న పల్లవులను దర్శకుడు పరశురామ్ ఫైనల్ చేసారని అన్నారు. ఈ సందర్భంగా ఆ 40 పల్లవులలోని ఓ పల్లవిని పాడి వినిపించగా, అది కూడా వీనులవిందుగా ఉండడం విశేషం.




ఈ సినిమా విశేషాలు గురించి ఒక్కటి కూడా బయటకు రాకపోవడంతో, అనంత శ్రీరామ్ వెల్లడించిన మహేష్ క్యారెక్టర్ పై ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ‘పోకిరి’ స్టైల్ లో ఎవరిని లెక్క చేయని మాస్ క్యారెక్టర్ లో సూపర్ స్టార్ కనిపించబోతున్నారని అనంత శ్రీరామ్ చెప్పకనే చెప్పారు. బహుశా అందుకనే ఏమో… మహేష్ కూడా ‘పోకిరి’ స్టైల్ లో ఉంటుందని ఒకటి, రెండు సందర్భాలలో వెల్లడించారు.

Also Read – మావాళ్ళు నాలుగు రాళ్ళు విసిరారు అంతే: జగన్‌