మార్ఫింగ్ తో బాల్క సుమన్ బదనాం చేసిన కేడీ లేడీస్

Sexual harassement case on balka suman-పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు హల్‌ చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు మహిళలపై ఎంపీ లైంగిక దోపిడీకి పాల్పడ్డారంటూ ప్రధానికి పాత్రికేయుల లేఖ రాశారంటూ ఓ కథనం చక్కర్లు కొడుతోంది. అయితే అదంతా అసత్య ప్రచారమని మంచిర్యాల సీఐ మహేశ్‌ తెలిపారు.

ADVERTISEMENT

బాల్క సుమన్‌ భార్య ఫొటోను మార్ఫింగ్‌ చేసి ఆమె స్థానంలో సంధ్య అనే అమ్మాయి ఫొటోను జోడించి సామాజికమాధ్యమాల్లో ప్రచారం చేశారని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్నవి తప్పుడు చిత్రాలని పేర్కొన్నారు. ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సంధ్య, విజిత అనే అక్కాచెల్లెళ్లు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని సీఐ అన్నారు.

మంచిర్యాలకు చెందిన వీరు ఎనిమిదేళ్లుగా పెద్దపల్లి, గోదావరిఖని, చంద్రాపూర్‌లలో పలువురిని బ్లాక్‌మెయిల్‌ చేశారని చెప్పారు. విచారణలో వీరికి సంబంధించి విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఫిబ్రవరి 6న సంధ్య, విజితలపై కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోనూ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories