
దసరా బుల్లోడు చిత్రంలో నల్లవాడే… అంటూ సాగే పాట ముగింపులో ఇద్దరు హీరోయిన్లు ‘వాడు నీవాడే… కాడు కాడు… వాడు నీవాడే…’ అంటూ హీరోని త్యాగం చేసేస్తుంటారు. అది సినిమా. ఇప్పుడు అంత త్యాగమూర్తులు ఎవరూ లేరు.
రాజ్‌తరుణ్ ట్రయాంగిల్ లవ్-పోలీస్ స్టోరీ ఇందుకు తాజా ఉదాహరణ. అయితే ఇప్పుడు సినిమా కబుర్లు కాదు… ఏపీలో అన్నా చెల్లెళ్ళ కధ చెప్పుకోవాలి.
Also Read – బనకచర్ల: తెలంగాణలో క్రెడిట్.. ఏపీలో డెబిట్!
ఆస్తుల విషయంలో వైఎస్ షర్మిల త్వరలో జగనన్నపై కోర్టులో దావా వేయబోతున్నట్లు తాజా సమాచారం. ఏపీలో అక్కాచెల్లెమ్మలందరికీ అప్పులు చేసి మరీ ఉదరంగా లక్షల కోట్లు పంచిపెట్టేసిన జగనన్న, తనకు మాత్రం తండ్రి ఆస్తిలో న్యాయంగా దక్కాల్సిన వాటా ఇవ్వలేదంటూ కోర్టుకి వెళ్ళబోతున్నారట!
ఆస్తి కోసమే కాదు… చనిపోయిన తండ్రి ఇమేజ్ కోసం కూడా అన్నాచెల్లెళ్ళు గొడవ పడుతుండటం విశేషం. దసరా బుల్లోడులో నల్లవాడిని ఇద్దరు హీరోయిన్లు త్యాగం చేసేందుకు సిద్దపడ్డారు. కానీ జగన్, షర్మిల ఇద్దరూ ‘వైఎస్ నావాడు… అంటే కాదు కాదు… నావాడే,’ అంటూ రాగాలు తీస్తూ పోటా పోటీగా ఇటీవల ఆయన జయంతి జరిపారు కూడా.
Also Read – కూటమి ప్రభుత్వం వల్లనే జగన్‌కు ఇంత హైప్?
తండ్రి బ్రాండ్ ఇమేజ్ సొంత చేసుకోవడం చెల్లి చేస్తున్న కుట్రలతో జరుగబోయే ప్రమాదాన్ని జగన్ పసిగట్టి అప్రమత్తమైన్నట్లే ఉన్నారు. అందుకే వైసీపి సోషల్ మీడియాలో ఇప్పుడు నిత్యం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలు, కనిపిస్తున్నాయనుకోవచ్చు.
నిజానికి తండ్రి చనిపోయినరోజు నుంచే జగన్ వైఎస్ పేరుని పూర్తిగా వాడేసుకుని రాజకీయంగా చాలా లాభపడ్డారు. జగన్ ఎప్పుడు ఎక్కడ ప్రసంగం చేసినా ప్రతీ మాటకు ముందూ వెనుకా “మన ప్రియతమ నేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి…’అంటూ దీర్గాలు తీయడం, ఆయన హావభావాలను అనుకరించడం అందరికీ గుర్తుండే ఉంటుంది. అది భావ దారిద్ర్యమే అయినా వర్తమాన రాజకీయాలలో అదే ట్రెండ్ నడుస్తోంది కనుక జగన్‌ని తప్పు పట్టలేము.
Also Read – 75 ఏళ్ళకు ప్రకాశంలో తాగునీటి ప్రాజెక్టు!
కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఇక ఆయన అవసరం లేదనుకున్నారో ఏమో వైఎస్ వాడకం కాస్త తగ్గించారు. అయితే కేసీఆర్ టిఆర్ఎస్‌ని వదులుకొని ఏవిదంగా నష్టపోయారో జగన్ వైఎస్‌ని వదులుకొని ఆవిదంగానే నష్టపోయారని చెప్పవచ్చు.
ఈవిషయం గుర్తించేలోగా ఆనాడు ప్రేమగా రాఖీ కట్టిన చెల్లెమ్మ షర్మిలే తండ్రి ఇమేజ్‌ని హైజాక్ చేసి ఎత్తుకుపోవాలని కుట్ర మొదలుపెట్టేసింది.
కనుక వైఎస్ కోసం జగన్ కూడా పోటీ తప్పడం లేదు. అందుకే వైసీపి సోషల్ మీడియాలో మళ్ళీ వైఎస్ ఫోటోలు రోజూ కనిపిస్తున్నాయి. మరి తెల్లగా ఉండే ఈ నల్లవాడు ఎవరికి దక్కుతాడో?