కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన తీన్మార్ మల్లన్న తెలంగాణలో బీసీ సామాజికవర్గ కుల రాజకీయానికి నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేసారు. అయితే అనూహ్యంగా గత కొంతకాలం నుండి రాజకీయాలలో సైలెంట్ మోడ్ లో ఉన్న మల్లన్న ఒక్కసారిగా కవిత మీద విమర్శలతో తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ అయ్యారు.
ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, కల్వకుంట్ల అనే బ్రాండ్ ఆడపడుచు, మాజీ ఎంపీ, ప్రస్తుత బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి ఫౌండేషన్ అధ్యక్షురాలు ఇలా కవిత పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ చాల బలంగా, పటిష్టంగా ఉంది.
సాధారణంగా ఇటువంటి బ్యాక్ గ్రౌండ్ నుంచి రాజకీయాలలోకి వచ్చిన మహిళ పట్ల ప్రత్యర్థి పార్టీ నాయకులు సైతం కాస్త ఆలోచించి ఆచి తూచి విమర్శలకు ముందుకొస్తారు. అలాగే కొంతమంది వైసీపీ నాయకుల మాదిరి అధిష్టానం ఆదేశాలతోనే, లేక అధినాయకత్వం మెప్పు కోసమో మూర్కంగా హద్దు దాటతారు.
కానీ తీన్మార్ విషయంలో ఆ సందర్భాలు ఏమి ఇక్కడ లేవు. ప్రస్తుతానికి ఏ పార్టీ నాయకుడిగా మల్లన్న ఏ రంగు జెండాను మోయడం లేదు, కాబట్టి ఆయనకు అధినాయకత్వం అంటూ ఎవరు లేరు. అయినప్పటికీ తీన్మార్ మల్లన్న కవితను టార్గెట్ చేస్తూ నీచమైన విమర్శలకు దిగడం,
అలాగే ఇప్పటికి తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ మరోమారు కవిత పై రెచ్చిపోవడం చూస్తుంటే తీన్మార్ తెగింపు వెనుక దెయ్యాలున్నయ్యా.? అన్న అనుమానులు కలుగుతున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైస్ షర్మిల పొలిటిల్ ఎంట్రీ నుంచి జగన్ తో విభేదాల వరకు షర్మిల పై ఎటువంటి వ్యక్తిగత విమర్శలు చోటుచేసుకోలేదు.
షర్మిల వైసీపీ కి వ్యతిరేకంగా అడుగులు వేసాక, జగన్ ను రాజకీయంగా టార్గెట్ చేసాక షర్మిల పుట్టుక నుంచి పెళ్లి వరకు అన్ని అంశాలు అటు సాక్షి వంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి ఇటు వైసీపీ సోషల్ మీడియా వరకు ఆమెకు వ్యతిరేకంగా చర్చలు జరిగాయి, పోస్టులు వెలిసాయి
సరిగ్గా ఇప్పుడు కూడా కవిత విషయంలో అలానే జరుగుతుంది. తెరాస తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కవిత ఉద్యమాల నుంచి అధికారం వరకు అన్ని దశలలోను రాజకీయాలలో యాక్టీవ్ గానే ఉన్నారు. కానీ ఏనాడు కవిత ప్రత్యర్థి పార్టీల నేతలు నుంచి ఇటువంటి విమర్శలను ఎదుర్కోలేదు.
ఇప్పుడు బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా జాగృతిని బలపరిచేందుకు అడుగులు వేస్తున్న సమయంలోను, కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించని సందర్భంలోను కవిత మీద ఇటువంటి విమర్శలు రావడంతో షర్మిల – కవిత ఇద్దరు ఒకే ప్యారలల్ యూనివర్స్ లో ప్రయాణం చేస్తున్నారా అనిపిస్తుంది.
వైస్ జగన్ ఇచ్చిన అనుమతితో నాడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నుంచి సాక్షి మీడియాలో పని చేసే సాధారణ జర్నలిస్ట్ వరకు షర్మిల పై వ్యక్తిగత విమర్శలతో తెగబడ్డారు. అడ్డుపడాల్సిన అన్నే షర్మిల కట్టుకునే చీర నుంచి పట్టుకునే చేయి వరకు బహిరంగ విమర్శలకు దిగితే ఇక సామాన్య కార్యకర్త నోటికి తాళం వెయ్యగలరా.?
ఇప్పుడు కవిత విషయంలో కూడా అంతర్గతంగా ఇదే జరుగుతుందా.? అందుకే మల్లన్నఅనుచిత వ్యాఖ్యల పట్ల గులాబీ దండు చూసి చూడనట్టు మౌనంగా ఉండిపోయిందా.? కేసీఆర్, కేటీఆర్ ల ఈ మౌనం ప్రత్యర్థి పార్టీల నాయకులకు బలం కానుందా.? ఈ ఘటనలన్ని కవిత కు భవిష్యత్ రాజకీయ పోరు ఏ స్థాయిలో ఉండబోతుందో రుచి చూపిస్తుందా.?




