రాజారెడ్డి, షర్మిల 2.0 నా.?

Sharmila’s Son Raja Reddy Enters AP Politics

నాడు అన్న వదిలిన బాణంగా రాజకీయ తెరమీద ప్రత్యక్షమైన వైస్ షర్మిల నేడు అన్నను వధించిన బాణంలా ఏపీ రాజకీయాలలో తగిన గుర్తింపు కోసం కాంగ్రెస్ పార్టీ తరుపున పోరాడుతున్నారు.

అయితే రాష్ట్ర విభజన నిర్ణయంతో పూర్తిగా శిథిలమైన కాంగ్రెస్ పార్టీతో షర్మిల రాజకీయ ప్రయాణం గమ్యం లేని పయనం మాదిరి కొనసాగుతుంది. వైసీపీ ని గద్దె దింపడానికి, జగన్ పై తన పంతం నెగ్గడానికి సాయపడిన కాంగ్రెస్ పార్టీ తనకు ఒక రాజకీయ ప్రయోజనాన్ని అందించడంలో మాత్రం చేయూత నివ్వలేకపోయింది.

ADVERTISEMENT

అయితే కాంగ్రెస్ పార్టీలో తనకు దక్కని రాజకీయ ప్రయోజనం, ప్రజాభిమానం తన వారసుడికి దక్కాలని షర్మిల భావిస్తున్నారా.? అందులో భాగంగానే తన రాజకీయ వారసుడిగా కుమారుడు రాజారెడ్డి ని ప్రజలకు పరిచయం చేయనున్నారా.? అంటే నేడు జరిగిన ఒక సంఘటన ఆ ఊహాగానాలను బలపరుస్తుంది.

సరైన మద్దతు ధర లేక ఆందోళన చెందుతున్న ఉల్లి రైతులను పరామర్శించేందుకు ఈ రోజు ఉదయం కర్నూల్ ఉల్లి రైతుల వద్దకు వెళ్లిన షర్మిల తన తో పాటు తన కుమారుడు రాజారెడ్డి ని సైతం వెంటబెట్టుకెళ్ళారు.

అలాగే రాజారెడ్డి ఇంటి నుండి తన అమ్మ షర్మిల తో బయలుదేరే ముందు తన అమ్మమ్మ విజయలక్ష్మి వద్ద ఆశీస్సులు తీసుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో నే రాజారెడ్డి రాజకీయ అరంగేట్రం మీద అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది.

అయితే షర్మిల కూడా రాజారెడ్డి రాజకీయ అరంగేట్రం పై స్పందిస్తూ తన కుమారుడు రాజకీయాలలోకి తప్పకుండా వస్తాడని, అయితే అందుకు అనుకూలమైన సమయం అవసరమంటూ తన రాజకీయ వారసుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీకి అధికారికంగా ఆమోద ముద్ర వేశారు.

అయితే 2019 ఏపీ ఎన్నికల తరువాత గాడితప్పిన షర్మిల పొలిటికల్ జర్నీ కాంగ్రెస్ ఎంట్రీతో దారిన పడుతుందిలే అనుకున్నప్పటికీ షర్మిలకు ఆశించిన స్థాయిలో రాజకీయ లబ్ది చేకూరలేదు. అన్నను గద్దె దింపాలి, వైసీపీ ని ఓడించాలి అనే లక్ష్యాన్ని నెగ్గగలిగిన షర్మిల కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ తో తన రాజకీయ భవిష్యత్ కి తగిన భద్రతను కల్పించుకోలేకపోయింది.

అయితే షర్మిల పొలిటికల్ ఎంట్రీ తోనే కుదేలైన వైసీపీ రానున్న సార్వత్రిక ఎన్నికలలో గెలిచి జగన్ 2.0 తో తిరిగి ఏపీ రాజకీయాలను శాసిస్తాం అంటూ రప్ప రప్ప రెచ్చిపోతుంటే షర్మిల మాత్రం, వైసీపీ కంటే ఒక అడుగు ముందుగానే జగన్ కంటే ఒక మెట్టు ఎక్కువే అన్నట్టుగా తన కొడుకు రాజరెడ్డే నే షర్మిల 2.0 గా వైసీపీ మీదకు ఎక్కు పెట్టనున్నారా.?

అన్న వదిలిన బాణం అన్న మీదకే అస్త్రాలను సంధిస్తున్నట్టు ఇన్నాళ్ళుగా ఏపీ రాజకీయాలలో సాగుతున్న అన్న – చెల్లెళ్ళ రాజకీయ యుద్ధం ఇక నుంచి మేనమామ – మేనల్లుడు గా మారబోతున్నాయా.?

రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ 2.0 అధికారంలోకి రాకుంటే వైసీపీ కి వ్యతిరేకంగా షర్మిల వేస్తున్న ఈ ముందడుగు రాజారెడ్డి, షర్మిల తో పాటుగా కాంగ్రెస్ పార్టీకి కూడా రాజకీయ భవిష్యత్ ని ఇచ్చే అవకాశం ఉంటుంది.

అయితే తనకు ఇప్పటి వరకు ఎటువంటి రాజకీయ ప్రయోజనం చేకూర్చలేని కాంగ్రెస్ పార్టీ తన వారసుడికి ఆ అవకాశం అందిస్తుందా.? వైఎస్ఆర్ ఛరిష్మా రాజారెడ్డి వరకు కొనసాగుతుందా.? అందుకు జగన్ సమ్మతిసారా.? ఇలా అనేక ప్రశ్నలు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ చుట్టూ తిరుగుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories