రిజర్వేషన్ల విషయంలో రాజకీయాలు, పార్టీలు, వ్యక్తుల ప్రయోజనాలు చూసుకుంటే చివరికి ఏమవుతుందో తెలుసుకోవడానికి బంగ్లాదేశ్‌లోని తాజా రాజకీయ పరిణామాలు కళ్లెదుటే ఉన్నాయి. రిజర్వేషన్ల అంశంపై ఆ దేశంలో అల్లకల్లోలంగా మారడంతో ప్రభుత్వాన్ని మిలట్రీ చేతుల్లోకి తీసుకుంది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ప్రాణభయంతో భారత్‌ పారిపోయి వచ్చారు.

Also Read – వైసీపీ నేతల కేసులు.. ఎక్స్‌ఎల్ షీట్ పెట్టాలేమో?

భారత్‌ సాయంతో 1971లో బంగ్లాదేశ్‌ పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వాతంత్ర పొందిన తర్వాత ఆ దేశ తొలి ప్రధాని షేక్ ముజిబూర్ రెహమాన్ సమర యోధుల కుటుంబాలకు ఉద్యోగాలలో 30శాతం రిజర్వేషన్ విధానం ప్రవేశపెట్టారు. అదే నేడు ఆయన కుమార్తె షేక్ హసీనా పదవి కోల్పోయేలా చేసింది.

అధికార అవామీ లీగ్ పార్టీకి చెందినవారికి లబ్ధి కలిగించేందుకు అమలు చేస్తున్న ఆ కోటాని రద్దు చేయాలంటూ అనేక ఏళ్ళుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ దేశ సుప్రీంకోర్టు కూడా 30 శాతం కోటాని రద్దు చేయాలని తీర్పు చెప్పింది.

Also Read – వైసీపీ నేతల రిమాండ్ కష్టాలు…

దానిపై షేక్ హసీనా ప్రభుత్వం తప్పుడు లేదా అనాలోచిత నిర్ణయాలతో నిరుద్యోగులలో ఆగ్రహావేశాలు పెంచిందని చెప్పవచ్చు. ప్రతిపక్షపార్టీలు, కొన్ని ఇతర శక్తులు ఆ నిప్పును రాజేసి హసీనాను గద్దె దించేశాయని చెప్పవచ్చు.

భారత్‌లో కూడా కొన్ని కులసంఘాలు, పార్టీలు, ప్రభుత్వాలు రిజర్వేషన్లతో రాజకీయాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ‘మండల్ కమీషన్‌’ అల్లర్లు ఓ చేదు జ్ఞాపకం ఉంది కూడా. అయినా కొన్ని పార్టీలు, కొందరు రాజకీయ నాయకులు, వ్యక్తులు కుల, మత రిజర్వేషన్లతో రాజకీయ మైలేజ్ లేదా లబ్ధి పొందేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి.

Also Read – అమెరికా- చైనా టిట్ ఫర్ టాట్ గేమ్స్ ఓకే కానీ..


ఇది నిప్పుతో చెలగాటమే… కొరివితో తల గోక్కొవడమే అని బంగ్లాదేశ్‌లో జరిగుతున్న అల్లర్లు, షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి భారత్‌ పారిపోయి రావడం నిరూపిస్తున్నాయి. కనుక వ్యక్తులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అందరూ కూడా రిజర్వేషన్ల విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.