అబ్బో… ఈ ఇద్దరూ పవన్ ఫోజు ఇస్తున్నారేంటి..!

Shekar Kammula Varun Tej, Shekar Kammula Varun Tej Movie Pre Production, Shekar Kammula Varun Tej Sai Pallavi, Shekar Kammula Varun Tej Movie Shootingగత కొంతకాలంగా వార్తల్లో నిలిచిన శేఖర్ కమ్ముల – వరుణ్ తేజ్ ల సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఈ సినిమాకు సంబంధించి యాక్టింగ్ వర్క్ షాప్స్ ప్రారంభమయ్యాయని మెగా హీరో వరుణ్ తేజ్ ఓ రెండు ఫోటోలను పోస్ట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా సమాచారం అందించారు. విలక్షణమైన సినిమాలను చేస్తున్న వరుణ్, ఈ సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల ఇచ్చిన పేపర్లను పట్టుకుని చదువుతుండగా, మరోవైపు శేఖర్ కమ్ముల సీన్లను వివరిస్తున్నట్లుగా కనపడుతోంది.

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రాండ్’ సీన్ ను (మెడ మీద చేయి వేసుకుని రుద్దుకోవడం) హీరోహీరోయిన్లకు వివరిస్తున్నట్లుగా ఉంది. వరుణ్ తేజ్ మాత్రం నవ్వుతూ చూస్తుండగా, హీరోయిన్ సాయి పల్లవి పవర్ స్టార్ సన్నివేశాన్ని అనుకరించే క్రమంలో ఉన్నట్లుగా కనపడుతోంది. బహుశా ఆ షాట్ లో హీరోయిన్ పవన్ ను అనుకరిస్తుందేమో..! కామెడీగా అయినా, సీరియస్ గా అయినా గానీ… దర్శకుడు, హీరోయిన్ పవన్ ఫోజు ఇవ్వడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories