ప్రత్యేక హోదా పోరాట యోధుల కర్ణాటక కష్టాలు

siddaramaiah yeddyurappaకర్నాటకలో ఎపి ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారు. ఇప్పటికే టీడీపీ వారు, ఏపీ ఎన్జీఓలు అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అయితే వీరందరికి వచ్చిన అతిపెద్ద కష్టం ఏమిటంటే బీజేపీని ఓడించామని చెప్పగానే రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ కు ఓటు వెయ్యాలని అడుగుతున్నారా అనే అర్ధం రావడం
.
అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు ఓటు వెయ్యమనలేక బీజేపీకి ఇండైరెక్టుగా మద్దత్తు ఇస్తున్న జేడీఎస్ కు ఓటు వెయ్యమనలేకపోతున్నారు. దానితో కేవలం బీజేపీని ఓడించి తద్వారా ప్రధాని మోడీకి గుణపాఠం చెప్పాలని మాత్రమే అంటున్నారు. వారి కష్టం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

ADVERTISEMENT

ఈ నెల 12న కర్ణాటక ఎన్నికల ఓటింగ్ జరగబోతుంది. 18న ఫలితాలు ప్రకటించనున్నారు. ఏ పార్టీ అయితే ఈ ఎన్నికలు గెలుస్తుందో ఆ పార్టీ 2019 సాధారణ ఎన్నికలలో ఫేవరెట్ గా ఉండబోతుంది. దీనితో కాంగ్రెస్, బీజేపీ కూడా రెండూ తమ సర్వశక్తులు వడ్డి పోరాడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories