singer-kalpana-on-ventilator

తన విలక్షణమైన గాత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న గాయని కల్పన ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. హైద్రాబాద్ లోని నిజాంపేటలో ఉంటున్న తన నివాసంలో కల్పన అచేతనంగా పడిఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

గత రెండు రోజుల నుంచి కల్పన బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగ ప్రవేశం చేసిన అధికారులు కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్టు నిర్ధారించారు.

Also Read – హస్తినలో అరకు కాఫీ ఘుమఘమలు

దీనితో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ఆమెకు వెంటిలేటర్ సహాయంతో వైద్య సదుపాయాలు అందిస్తున్నట్టు సమాచారం. అయితే కల్పన భర్త ప్రసాద్ రెండు రోజుల క్రితం చెన్నై వెళ్లడంతో ఫ్లాట్ లో ఒంటరిగా ఉన్న ఆమె ఇలా ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతూ ఒక దయనీయమైన పరిస్థితిలో కనిపిస్తున్నారు.

మొన్న మహాశివరాత్రి మహా పర్వదినాన కూడా ఈటీవీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో శివారాధన చేసిన కల్పన ఇప్పుడు ఇలా కనిపించడంతో అసలు కల్పనకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమిటి అనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనితో ఈ విషయమై ఆమె భర్త ప్రసాద్ ను పోలీస్ అధికారులు విచారిస్తున్నారు.

Also Read – చంద్రబాబు వద్దు.. లోకేష్‌ ముద్దు!


అయితే విషయం తెలుసుకున్న తన తోటి గాయనీగాయకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్పనను చూడడానికి ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అయితే మొన్నటి వరకు తమతో కలిసి పాటలు పాడిన వ్యక్తి ఇప్పుడు ఇలా వెంటిలేటర్ మీద ప్రాణాలతో పోరాటం జీర్ణించుకోలేకపోతున్నారు గాయనీమణులు. అయితే ప్రముఖ సింగర్స్ సునీత, శ్రీ కృష్ణ, గీత మాధురి, కారుణ్య ఇప్పటికే ఆసుపత్రికి చేరుకొని కల్పనను పరామర్శించారు.