Jagan YSRCP Party

మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తనకి పోలవరం ప్రాజెక్టు గురించి ఏమీ అర్ధం కాలేదన్నారు. సంక్రాంతి పండుగకు సత్తెనపల్లి రోడ్లపై రికార్డింగ్ డాన్సులు చేయడం, సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడటం తప్ప మరేం తెలుసునీకు?అంటూ ప్రజలు నవ్వుకున్నారు.

ఆయన ఇప్పుడు తమ పార్టీ ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయిందో అర్దం కావడం లేదు. అలాగే కూటమి అంత భారీ మెజార్టీతో ఎందుకు గెలిచ్చిందో కూడా అర్దం కావడం లేదన్నారు. కనుక మరోసారి నవ్వుకోవలసిందే!

Also Read – దేశంలో ఇక బీజేపి ఒక్కటే… అడ్డేలే!

ఎన్నికలలో రాజకీయ పార్టీలు గెలుపోటముల గురించి పోలింగ్ పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్‌ అంచనా వేసి చెప్పేస్తుంటాయి. అవి ఎందువల్ల ఓడిపోబోతున్నాయి? ఎందువల్ల గెలవబోతున్నాయో అప్పుడే రాజకీయ విశ్లేషకులు చెపుతుంటారు.

కొన్నిసార్లు ఆ అంచనాలు తప్పవచ్చు. కానీ వారు లోతుగా విశ్లేషించి చెప్పే ఆ విషయాలు అర్దం చేసుకుంటే చాలు పార్టీలు గెలుపోటముల గురించి అవగాహన కలుగుతుంది.

Also Read – ఆప్ ఓటమికి బిఆర్ఎస్ స్కాములే కారణమా..?

ఫలితాల వచ్చిన తర్వాత ప్రతీపార్టీకి ఖచ్చితంగా తాము ఎందువల్ల ఓడిపోబోయాము? ఎందువల్ల గెలిచాము? అని పూర్తి స్పష్టత వస్తుంది.

అయినప్పటికీ ఓడిపోయిన పార్టీలు సమీక్షా సమావేశాలు నిర్వహించుకొని మరింత లోతుగా విశ్లేషించుకొని తమ ఓటమికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి.

Also Read – ఏపీలో క్రూజ్ పర్యాటకం త్వరలో..

ఆయా పార్టీల తమ ఓటమికి అసలు కారణాలు ఖచ్చితంగా తెలుసుకున్నప్పటికీ అవన్నీ అందరికీ చెప్పుకొని నవ్వులపాలు కావాలనుకోరు కనుక కొన్ని తప్పులు, లోపాల కారణంగా ఓడిపోయామని చెప్పుకుంటారు. తర్వాత ప్రత్యర్ధి పార్టీలు చెప్పిన మాయమాటలు నమ్మి ప్రజలు వాటిని గెలిపించడం వలననే తాము ఓడిపోయామని చెప్పుకుంటాయి.

ఏపీలో పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈసారి భారీ మెజార్టీతో మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నామని జగన్‌ చెప్పుకున్నారు. తమకి ఘన విజయం అందిస్తున్నందుకు ఐప్యాక్ టీమ్‌ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వారితో సెల్ఫీలు కూడా దిగారు. కానీ అదే నోటితో ఈవీఎంల కారణంగానే ఓడిపోయామని జగన్‌ చెప్పుకోవడం సిగ్గు చేటే కదా?

నిజానికి ఎన్నికలకు ఏడాది ముందే జగన్‌ తనని కలిశారని అప్పుడే సంక్షేమ పధకాలతో గెలిచే అవకాశం లేదని చెప్పానని ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పారు. అంటే అప్పటికే తన ఓటమి ఖాయమని జగన్‌ గ్రహించారు. అయినా 175/175 పాట పాడుతూ పార్టీలో అందరినీ మభ్యపెడుతూనే ఉన్నారు.

ఆ తర్వాత టీడీపీ, జనసేనలు దగ్గరవుతున్నప్పుడూ జగన్‌ ప్రమాదం శంకించారు. అందుకే వాటి మద్య చిచ్చు పెట్టి దగ్గర కాకుండా చేయాలని విశ్వప్రయత్నాలు చేశారు. కానీ చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టి వాటిని జగన్‌ స్వయంగా కలిపారు.

అవి పొత్తులు పెట్టుకోవడమే కాకుండా వాటితో బీజేపి కూడా పొత్తు పెట్టుకోవడంతో తమ ఓటమి ఖాయమని జగన్‌ గ్రహించారు. అందుకే ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించలేదంటూ జగన్‌ ఈసీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిందించారు.

అంటే ఎన్నికలలో వైసీపీ ఓడిపోబోతోందని జగన్‌కు ఖచ్చితంగా ముందే తెలుసన్న మాట! ఆ భయంతోనే అభ్యర్ధులను మార్చేశారు కూడా.

కానీ సంక్షేమ పధకాల వలన తమకు కనీసం గౌరవప్రదమైన సీట్లు లభిస్తాయని జగన్‌ అనుకున్నారు. కానీ 5 ఏళ్ళ వైసీపీ ఆరాచకాలు, అవినీతి, పాపాలు, భూములు, పోర్టుల కబ్జాలు, చెత్త పన్ను, చెత్త పాలన వంటివన్నీ చూసి వేసారిపోయిన ప్రజలు నిశబ్ధంగా తమ తీర్పు చెప్పేశారు.

కనుక వైసీపీ ఓటమి ఇన్ని కారణాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఇంకా ఎందువల్ల ఓడిపోయామో తెలియదని అంబటి రాంబాబు అంటే ఖచ్చితంగా ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది.

ఓటమికి ఇన్ని కారణాలున్నాయని తెలిసి ఉన్నా చేసిన తప్పులకు లెంపలు వేసుకొని, తమ ధోరణి సరిదిద్దుకోకపోతే నియోజకవర్గం ఇన్‌ఛార్జీలను ఎంతమందిని మార్చినా వైసీపీని ఆ జగన్‌ కూడా కాపాడలేరు.