Ipl 2024

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మొదలయ్యి సుమారు 4 వారాలు కాగా, అన్ని జట్టులు ఇంచుమించు సగం మ్యాచ్లను పూర్తిచేసుకున్నాయి. ప్రతీ సంవత్సరం లాగానే ఈ ఐపీల్ కూడా అభిమానులను అలరించటం లో ఎక్కడ వెనక పడలేదు. సగం మ్యాచ్లు మాత్రమే ముగిసినా, ఈ 2024 ఐపీల్ ఎన్నో పాత రికార్డు ల ను గల్లంతు చేసింది. కేవలం ఐపీల్ చరిత్రలోనే కాక టి 20 ఇంటెర్నేషనల్స్ లో రికార్డ్స్ ని సైతం తుడిచిపెట్టేసింది.

ఈ ఏడాది ఓపెనింగ్ మ్యాచ్ అంత రసవత్తరంగా లేనప్పటికీ, మూడవ మ్యాచ్ నుండే ఐపీల్ మజాను రుచి చూపింది. ఇక 8 వ మ్యాచ్ గా సన్ రైజర్స్ మరియు ముంబై ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో,తొలుత బాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఏకంగా 277 పరుగులు చేసి ఐపీల్ లో నే అత్యధిక స్కోరును నమోదు చేసి గత రాయల్ ఛాలెంజర్స్ పేరిట నమోదైన 263 స్కోర్ రికార్డు ను బద్దలుకొట్టింది.

Also Read – మోడీ మళ్ళీ ప్రధాని అయితే…

అలాగే 278 ఛేదనా లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఎక్కడా తగ్గేదే లేదు అంటూ మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ 246 పరుగులు వరకు చేరుకోగలిగింది. ఇలా ఛేజింగ్లో 246 పరుగులు సాధించిన మొదటి జట్టుగా రికార్డు లోకి ఎక్కింది. దానితో పాటు ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు సాధించిన జట్టుగా, ఒకే మ్యాచ్ లో అత్యధిక పరుగులను నమోదు చేసిన టి 20 మ్యాచ్ గా ఇలా ఆ మ్యాచ్ లో నే ఎన్నో ఐపీల్ రికార్డులు బద్దలయ్యాయి.

అయితే సరిగ్గా వారం రోజుల తరువాత విశాఖపట్నం వేదికగా కోల్కతా మరియు ఢిల్లీ తలపడగా, మొదట బాటింగ్ చేసిన కోల్కతా ఏకంగా 272 పరుగులు చేసి, సన్రైజర్స్ పేరిట ఉన్న రికార్డు కి అతి చేరువగా వచ్చారు. ఇలా ఒకే టోర్నమెంట్లో రెండు సార్లు 270 + పరుగులను స్కోర్ చెయ్యటం ఇదే తొలి సారి. అయితే మరికొన్ని రోజుల వ్యవధిలోనే ముంబై వేదికగా బెంగళూరు మరియు ముంబై తలపడిన పోరు లో, ఆర్సీబీ 196 పరుగులు చేయగా, ఛేదన లో ముంబై లక్ష్యాన్ని కేవలం 15 .3 ఓవర్లలోనే పూర్తిచేసి, ఐపీల్ మజా ను ఫాన్స్ కు మళ్ళీ రుచి చూపారు.

Also Read – ఇప్పుడు కేసీఆర్‌, రేపు జగన్‌… ఓటమికి కుంటి సాకులు ఎన్నెన్నో!

ఇక ఇటీవలే చిన్నస్వామి వేదికగా సన్రైజర్స్’ బెంగళూరు తో తలపడగా, టాస్ గెలిచి హైదరాబాద్ ను తొలుత బాటింగ్ కు ఆహ్వాహించింది బెంగళూరు. ఇక సన్రైజర్స్ చిన్నస్వామి లో పరుగుల వరద పారించారు. హెడ్ సెంచరీ తో చెలరేగగా, క్లాస్సేన్ తన హాఫ్ సెంచరీ తో ఫామ్ ను కొనసాగించాడు. అలాగే యువ ఆటగాళ్లు సమద్,అభిషేక్ మరియు మర్కరం వీరోచితమైన బాటింగ్ శైలి తో సన్ రైజర్స్ ను తిరిగి చరిత్ర పుటమిలో అగ్ర స్థానానికి చేర్చారు.

వీరు 287 పరుగులు చేసి, తాము నెలకొల్పిన రికార్డు ను తామే బద్దలకొట్టగలరనేటట్లు బెంగళూరు లో వీర విహారం చేసారు. ఈ క్రమంలో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లను నమోదు చేసిన టీం గా ముంబై పేరిటనున్న రికార్డు ను సైతం బద్దలుకొట్టి వాహ్ అనిపించారు. తిరిగి ఛేదన లో బెంగళూరు సైతం తమ వెన్ను చూపకుండా, వారి పోరాట పటిమ ను చూపిస్తూ ఏకంగా 262 పరుగులను చేసారు.

Also Read – ఏపీ, తెలంగాణ సత్సంబంధాలు సాధ్యమేనా?

మొత్తం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన 13000 టి 20 మ్యాచ్లలో మునుపెన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్ లో మొత్తం ఇరు జట్లు కలిసి 549 పరుగులను నమోదు చేసి, చరిత్ర లో మరెవ్వరికీ సాధ్యం కాని అరుదైన రికార్డు ను ఈ సంవత్సరం ఐపీల్ వేదికగా రూపుదిద్దారు. అలాగే ఆ తరువాత జరిగిన కోల్కతా vs రాజస్థాన్ మ్యాచ్లో ముందుగా బాటింగ్ కు వచ్చిన కోల్కతా బాట్స్మన్ నరైన్ సెంచరీ తో 223 భారీ స్కోరును సాధించి, రాజస్థాన్ కు 224 రికార్డు స్కోరు లక్ష్యాన్ని ముందుంచారు.

లక్ష్య ఛేదనలో మొదటినుండి మంచి స్కోరును చేసినప్పటికీ వరుసగా వికెట్లను కోల్పోవటంతో రాజస్థాన్ కష్ట సమయాల్లో ఆ జట్టు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ సెంచరీ తో చెలరేగి ఆ జట్టుకు ఒక రికార్డు స్థాయి విజయాన్ని అందించారు. దీనితో ఇప్పటివరకు 224 రన్స్ ఛేజింగ్ తో రాజస్థాన్ తన పేరిట మరో రికార్డ్ నమోదు చేసుకుంది. ఇంకా ఈ ఏడాది ఐపీల్ లో సగం మ్యాచ్లు మిగిలుండగా, కొన్ని పాత రికార్డులను బద్దలు కొట్టడం, అలాగే కొన్ని కొత్త రికార్డులను నెలకొల్పడం తో ఈ ఐపీల్ చివరాంకంలో మరెన్ని రికార్డులు గల్లంతు కావడం ఖాయంగా కనపడుతుంది.