Social-Media-Age-Restriction

నేడు డిజిటల్ మీడియా ఆకాశమే హద్దుగా తన పరిధిని విస్తరించుకుంటూ పోతుంది. టెక్నాలజీ లో వచ్చిన వినూత్న మార్పులతో సోషల్ మీడియా అనేది సామాన్యుడికి దినచర్యలో ఒక భాగమైపోయింది.

యద్ భావం తత్ భవతి…మనం ఏ దృష్టితో చూస్తామో అదే ప్రతిభింబిస్తుంది అనే సామెత మాదిరి సోషల్ మీడియా కూడా మనం ఏవిధంగా వినియోగించుకుంటామో అదే ఫలితాన్ని ఇస్తుంది. మద్యం, సిగిరెట్, డ్రగ్స్ ఎలా అయితే సమాజాన్ని పట్టి పీడుస్తున్నాయో ఇప్పుడు సోషల్ మీడియా కూడా సమాజాన్ని చెడు వైపు ఆకర్షిస్తుంది.

Also Read – జగన్ ‘బలం’…బాబేనా..?

ముఖ్యంగా యువత ఈ సోషల్ మీడియా రొచ్చులో పడి జీవితాలను క్కూడా కోల్పోతున్నారు. తమలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, దానితో జీవితంలో తమన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి సోషల్ మీడియాను ఒక వేదికగా వాడుకుంటూ పైకి ఎదుగుతున్న వారు అనేకమంది ఉన్నారు.

అలాగే అదే సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని అక్రమ మార్గంలో డబ్బులు దండుకునే వారు, ఒకరిని కించపరుస్తూ పైశాచిక ఆనందం పొందే వారు, మార్ఫింగ్ లతో అమాయకులను బెదిరించి తమ అవసరాలను తీర్చుకునే వారు ఇలా ఈ సోషల్ మీడియా వెనుక అనేక చీకటి దండాలు నడుపుకునే వారు నానాటికి తమ పరిధిని విస్తరిస్తున్నారు.

Also Read – నువ్వొస్తానంటే మేమొద్దంటామా.?

సైబర్ నేరాలకు అడ్దుకట్ట వేయడానికి, సోషల్ మీడియా వేధింపులకు చెక్ పెట్టడానికి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా ఆకతాయిలు తమ అలవాటును మార్చుకోవడం లేదు. ఈ మధ్య సోషల్ మీడియాలో రోస్టింగ్ కల్చర్ బాగా విస్తరిస్తుంది.

ఒక ముగ్గురు నలుగురు కలిసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన చేసిన ఒక వీడియోను కానీ, లేదా ఏదైనా ఒక సినిమాను కానీ, హీరోనో, హీరోహీనో లేదా తమ ఆనందానికి తనకు సంబంధం లేని వ్యక్తులను కూడా తమ ఫ్లాట్ ఫామ్స్ మీదకు తెచ్చి రోస్టింగ్ పేరుతో రచ్చ చేస్తున్నారు.

Also Read – రెండు జోడీలు… నలుగురు మిత్రుల కథ..!

ఈ విషయమై మెగా హీరో సాయి తేజ్ స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కంటెంట్ లో మీ పిల్లల చిత్రాలు ఉండకుండా జాగ్రత్త వహించండి అంటూ మొన్నిఈమధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ను ఉద్దేశించి తన X లో స్పందించారు. సాయి చేసిన ఆపనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కూడా అభినందించారు.

రోజురోజుకి మానవతా విలువలు మరిచి సంస్కారాన్ని పక్కన పెట్టి సోషల్ మీడియాలో తమ పైత్యాన్ని చూపిస్తున్న కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సేర్ ల మీద సోషల్ మీడియా అకౌంట్ల మీద చర్యలకు సిద్దమయ్యింది తెలంగాణ ప్రభుత్వం. క్రియేటివిటీ పేరుతో సమాజంలో ఉన్న చెత్తంతా సోషల్ మీడియాలో వేస్తున్న వారికి తగిన శిక్షలు పడాల్సిన సమయం వచ్చింది.

సెలబ్రెటీల నుండి సామాన్యుడి వరకు అందరూ ఎదో ఒక సమయంలో ఈ సోషల్ మీడియా బాధితులుగా మారుతున్నారు. సమాజంలో దేవుళ్లుగా కొలిచే వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియా బారిన పడి అవమానాలను ఎదుర్కుంటున్నారు. ఎక్కడో అక్కడ ఈ విష సంస్కృతికి అడ్దుకట్ట వేయకపోతే భావితరం భవిష్యత్తు ఈ సోషల్ మీడియా కోరలలో చిక్కుకుని బలైపోతుంది.

ప్రభుత్వాలు ఈ సోషల్ మీడియా అనే అదృశ్య నేత్రానికి తమ చట్టాలతో కళ్లెం వేయాల్సి ఉంది. ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే ఈ కలియుగంలో కలి పాత్ర ఈ సోషల్ మీడియానే పోషించబోతుందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మరి ఆ కలిని అడ్డుకునే ‘కల్కి’ పాత్ర పోషించేదెవరు.?