తెలుగు సినిమా కొరియోగ్రాఫర్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్న డాన్స్ మాస్టర్లలో శేఖర్ ఒకరు. అయితే గత కొన్ని రోజుల నుండి ఈయన కొరియోగ్రఫీ చేసిన సినిమాల పాటల మీద, అందులో వచ్చే కొన్ని స్టెప్పుల మీద తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.
గత ఏడాది రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో వచ్చిన ‘సితార’ పాట కంపోసింగ్ మీద కూడా ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కొన్నారు శేఖర్. హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ మధ్యన సాగే నృత్యం లో కొన్ని కదలికలు చూడడనికి ఇబ్బందికరంగా ఉన్నాయంటూ ఆ పాట మీద సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది.
ఇక దాని కొనసాగింపుగా తాజా సెన్సేషన్ పుష్ప మూవీ లో కూడా అల్లు అర్జున్, రష్మిక మధ్య సాగే ‘ఫీలింగ్స్’ పాటకు కూడా శేఖర్ మాస్టరే కొరియోగ్రఫీ అందించారు. ఇక పాట విషయంలో కూడా రష్మిక, బన్నీ మధ్య ఉండే కొన్ని స్టెప్పుల మీద సేమ్ అదే రచ్చ కంటిన్యూ అయ్యింది.
అయితే ఇక్కడ ఈ పాట రిహార్సల్ సమయంలో కొన్ని డాన్స్ మూమెంట్స్ వేయడానికి నేను కూడా మొదట్లో చాల ఇబ్బంది పడ్డానంటూ రష్మిక కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు సంక్రాంతికి రాబోతున్న బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీలో కూడా బాలయ్య, ఊర్వశి రౌతౌలే మధ్య వచ్చే మాస్ సాంగ్ ‘దబిడి దిబిడి’ పాట కొరియోగ్రఫీ పట్ల కూడా ప్రేక్షుకులను నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది.
ఆ స్టెప్పులేంటి సామి అంటూ సోషల్ మీడియాలో శేఖర్ మాస్టర్ పై ట్రోలింగ్ఫ్ కూడా దబిడి దిబిడే అన్నట్టుగా సాగుతుంది. ఒక సీనియర్ కొరియోగ్రాఫర్ అయ్యిండి, వస్తున్న విమర్శలను కూడా పట్టించుకోకుండా ఇలా ఒకే తరహా మొమెంట్స్ తో శేఖర్ మాస్టర్ పాటలలో కూడా వల్గారిటీని ప్రమోట్ చేస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో శేఖర్ మీద విమర్శలు కురిపిస్తున్నారు.
ఇక హీరో, హీరోయిన్స్ కూడా కాస్త విచక్షణగా ఆలోచించి ఈ తరహా స్టెప్పులకు దూరంగా ఉంటే అది వారి స్థాయికి, వారి హోదాకి గౌరవం దక్కినట్టవుతుంది. ఇటువంటి స్టెప్పులు ఎవరో అప్ కమింగ్ హీరోలతో చేయించినా, ఆ హీరోలు చేసినా శేఖర్ మాస్టర్ మీద కానీ అందులో నటించిన నటీనటుల మీద కానీ ఈ స్థాయి విమర్శలు రాకపోవచ్చు.
కానీ రవి తేజా, అల్లు అర్జున్, బాలకృష్ణ వంటి టాప్ హీరోలను పెట్టుకుని ఇటువంటి అస్లీల మూమెంట్స్ చేయడం అంటే అది శేఖర్ మాస్టర్ బాధ్యత రాహిత్యమే అవుతుంది. అలాగే అగ్ర నటులుగా కొనసాగుతున్న ఈ హీరోలు కూడా ఇటువంటి వాటిని పోత్సహించకుండా ఉండడం సముచితం.




