సోషల్ మీడియాకు ఆహారమైన మాజీ సీఎం..!

YS Jagan

గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎం జరగకూడదను అని జగన్ భావిస్తున్నారో అదే జరిగి తీరుతుంది అని మరోసారి రుజువయ్యింది. బాబు జైలు నుండి బయటకు రాకూడదు అనుకున్నారు వచ్చారు. టీడీపీ జనసేన కలవకూడదు అనుకున్నారు టీడీపీ, జనసేనలతో కలిసి బీజేపీ కూడా పోటీ చేసింది.

ఎట్టి పరిస్థితులలోనూ కూటమి పార్టీలు అధికారంలోకి రాకూడదు అనుకున్నారు. 164 సీట్లతో చరిత్ర ఎరుగని విజయంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా ఎన్నికలకు ముందు వాలంటీర్లు లేకపోతే సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఇళ్లకు డోర్ డెలివరీ చేయలేము అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రే తమ తమ నియోజకవర్గాలలో పెన్షన్లను పంపిణీ చేసి చూపించారు అంటూ సోషల్ మీడియాలో జగన్ కు కౌంటర్లు పేలుతున్నాయి. .

ADVERTISEMENT

చంద్రబాబు కు వయస్సు అయిపొయింది ఇక ఆయనకు రాజకీయ రిటైర్ మెంటే అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే బాబు స్థాయికి పోటీపడే నాయకుడే ఏపీలో లేడు అనేలా తానూ పరిగెడుతూ అధికారులను పరిగెత్తిస్తున్నారు. గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా జగన్ ఏనాడూ ప్రెస్ ముందుకు వచ్చిందే లేదు. కానీ ఇప్పుడు రోజుకోసారి ముఖ్యమంత్రిగా బాబు ప్రెస్ ముందుకు వచ్చి ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను ప్రజలకు వివరిస్తున్నారు.

జగన్ తన హయాంలో ఒక్క ప్రెస్ మీట్ కానీ ఒక్క మీడియా సమావేశం కానీ జరిపిందే లేదు. తానూ చదివిన స్క్రిప్ట్ పేపర్ విని ఎవరికీ అర్ధమైన రీతిలో వారు విశ్లేషణలు చేసుకోవడమే కానీ ఏనాడూ శాఖల మీద రివ్యూలు చేయడం కానీ, సమీక్షలు జరపడం కానీ జరగలేదు. మీడియా అంటే ప్రశ్నించడానికి కాదు భజన చేయడానికి అనే కొత్త సంస్కృతిని తీసుకు వచ్చారు. ప్రెస్ మీట్లు అంటే బూతులు తిట్టడానికే అని అలవాటు చేసేసారు.

పరదాలు కట్టుకుని ప్రజా వేదికలకు రావడం…పరదాల ముఖ్యమంత్రిగా చరిత్ర కెక్కడం ఒక్క జగన్ కే సాధ్యమయ్యిందంటూ జగన్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. నేడు పెన్షన్ పండుగ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా లబ్దిదారుల ఇళ్లలోకి వెళ్లిపోయారు. వారితో మాటామంతి చేస్తూ వారి కుటుంబంలో ఒక్కడిగా కలిసిపోయారు.

గత ఐదేళ్లలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో జగన్ చెపితే ఎలా ఉండాలో ఇప్పుడు నేను నిరూపించాలి అంటూ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనితో ఈ రోజు సోషల్ మీడియాకు ఆహారమయ్యారు మాజీ ముఖ్యమంత్రి జగన్. సొంత తల్లిని చెల్లిని కూడా పరాయి వాళ్ళుగా భావించే జగన్ కు ప్రజలే కుటుంబం అని భావించే నేతలకు మధ్య వ్యత్యాసం ఈనాడు స్పష్టంగా కనిపిస్తుంది అంటూ బాబు, పవన్ ఫోటోలను పోస్టు చేస్తున్నారు.

పులివెందుల పులి అంటూ చెప్పుకున్న జగన్ ఇప్పటి వరకు గత ఐదేళ్ల తన పాలన మీద వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పే సాహసం కూడా చేయలేకపోయారు.అధికారంలో ఉన్నన్నాళ్ళు ప్యాలస్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అధికారం పోగానే సోషల్ మీడియా నేతగా మారిపోయారా.? అంటూ సెటైర్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలంటూ జగన్ సలహాలిస్తున్నారు.

పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అన్న ఆ ప్యాలస్ ల పేదవాడు ఎటుపోయాడో. వాలంటీర్లు లేకపోతే పాలన స్తంభించిపోతుంది అన్న ఆ మహానేత ఇప్పుడెక్కడున్నాడు. పరదాల చాటున పాలనకు ప్రజల మధ్య జరిగే పాలనకు వ్యత్యాసం కనిపించనుందా.? అంటూ జగన్ ను గట్టిగా వేసుకుంటున్నారు టీడీపీ, జనసేన అభిమానులు.

జగన్ స్థాయి తగ్గితే కానీ రాష్ట్ర రాజధాని అమరావతి స్థాయి పెరగలేదని, నేను ఉన్నాను …నేను విన్నాను అంటూ నినాదాలు ఇవ్వడం కాదు పాలన చేయడానికి ప్యాలస్ లతో పని లేదు అంటున్న పవన్ వ్యాఖ్యలు విన్నారా.? అంటూ జగన్ పై మండిపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories