బిజెపి నేత , ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఒక ఆసక్తికరమైన ప్రశ్న లేవనెత్తారు. తెలుగుదేశం ఎమ్.పి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తెరవెనక్కి ఎందుకు వెళ్లిపోయారని ఆయన ప్రశ్నించారు. అయితే సుజనా చౌదరి గురించి సోము వీర్రాజుకు బెంగ ఎందుకో? అది తెలుగు దేశం పార్టీ అంతర్గత వ్యవహారం కదా?
ఎన్.డి.ఎ. నుంచి బయటకు రావడాన్ని ఆయన ఇష్టపడలేదని, బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు గతంలో పుకార్లు వ్యాపించాయి. బ్యాంకు లావాదేవీల వ్యవహారాలలో ఉన్న లొసుగుల కారణంగా ఆయన కేంద్రంతో గొడవ పెట్టుకునే ఉద్దేశంలో లేరని అన్నారు. అయితే పార్టీని వదలడం లేదని ఆ మధ్య ఆయన స్వయంగా వివరణ ఇచ్చారు.
కాని తోటి ఎంపీ సి.ఎమ్.రమేష్ దీక్ష విషయంలో కాని, డిల్లీలో మిగిలిన ఎమ్.పిలతో కలిసి వెళ్లడం వంటివి ఆయన చేసినట్లు కనిపించలేదు. దీనితో వీర్రాజు ఆ ప్రశ్న అడిగి ఉండాలి. అయితే అది ఎందుకైనా సోము వీర్రాజుకు దానితో పనేముంది? దాని వల్ల రాష్ట్రానికి వచ్చిన లాభం నష్టం ఏంటో?



