చంద్రబాబు మోడీ వీడియోలను మార్ఫింగ్ చేశారట!

Chandrababu Naidu - Narendra Modiరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ తిరుపతిలోనే కాదు.. నెల్లూరు సభలోనూ ఎప్పుడూ చెప్పలేదని తెదేపా నాయకులు ప్రధాని మాటలను మార్చి, తప్పుదోవ పట్టిస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ, ఆ పార్టీకి కాబోయే రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.

14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా వద్దని తేల్చిచెప్పడంతో రాష్ట్రానికి హోదాతో సమానమైన నిధులు ఇచ్చామన్నారు. దిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి.. ప్రధాని మోదీ మార్ఫింగ్‌ వీడియోలను చూపించి చంద్రబాబు జాతీయ మీడియాను పక్కదోవ పట్టించారని ఆరోపించారు. అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు, వెంకయ్య నాయుడు తరుజుమా మనం అంతా విన్నాము.

ADVERTISEMENT

ఆ వీడియోలు కూడా అంతటా ఉన్నాయి. ఒక వేళ నిజంగా చంద్రబాబు వీడియోలు మార్ఫింగ్ కు పాల్పడితే అది తీవ్రమైన కేసు అవుతుంది కూడా. పై పెచ్చు బీజేపీ మేనిఫెస్టోలో పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాం అని పెట్టిన మాట వాస్తవం కదా? ఇలాంటి కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెడదాం అనుకుంటున్నారా వీర్రాజు గారు?

ADVERTISEMENT
Latest Stories