sonu-sood-met-chandrababu-naidu

కరోనా మహమ్మారి సమయంలో వైరస్ బారిన పడి చితికిన ఎన్నో కుటుంబాలకు తనవంతు సాయమందించి రియల్ హీరోగా ప్రసిద్ధి చెందిన యాక్టర్ సోను సూద్ నేడు ఏపీలోని అమరావతికి విచ్చేసారు.

వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిసిన సోను ఏపీ ప్రభుత్వానికి 4 అత్యవసర సేవలు అందించే అంబులెన్సు లను విరాళంగా ఇచ్చారు. దీనితో సోను మరోసారి తెలుగు ప్రజల మేలు కోసం నాలుగడుగులు ముందుకొచ్చారు అంటూ ఆయన సాయం మీద అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read – సజ్జల లేని లోటు కనిపిస్తోందా.. మావయ్యా?

సోను సూద్ ఫౌండేషన్ తరుపున ఏపీ ప్రజల అవసరం మేరకు ప్రభుత్వానికి ఇచ్చిన అంబులెన్సు లకు గాను సోను ను అభినందించిన సీఎం చంద్రబాబు వాటిని ప్రారంభించారు. అయితే సినిమాలలో విలన్ క్యారెక్టర్లు చేసే సోను నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోలా అందరికి చేయూతనివ్వడం హర్షణీయం.

త్రివిక్రమ్, అల్లు అర్జున్ జులాయి సినిమాలో బన్నీకి ప్రతి నాయకుడిగా నటించిన సోను సూద్ తెలుగు ప్రజలకు చాల దగ్గరయ్యారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పోటీపడి మరి సోను తన నటనను ప్రదర్శించారు. దీనితో ఈయనకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కింది. అయితే అప్పుడు సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంటే ఇప్పుడు సాయంతో గౌరవం దక్కించుకుంటున్నారు.

Also Read – జగన్‌ 2.0 కోసం కార్యకర్తలు జైళ్ళకి వెళ్ళాలా?


అయితే గతంలో కూడా సోను సూద్ తనకు చంద్రబాబు నాయకత్వం మీద అపార గౌరవం ఉందని, అలాగే ఆయన పాలన మీద కూడా పూర్తి నమ్మకం ఉందని, బాబు విజనరీ అభివృద్ధికి మార్గమంటూ తనకు బాబు పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. నేడు స్వయంగా సీఎం గా ఉన్న బాబుని కలిసి తనకున్న పరిధి మేరకు ప్రభుత్వానికి సాయమందించారు.