భారత క్రికెట్ లెజెండ్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హోమ్ క్వారంటైన్ కు వెళ్లాల్సి వచ్చింది. సౌరవ్ అన్న గారికి కరోనా పాజిటివ్ గా పరీక్షించబడింది. ఆయనకు డైరెక్టు కాంటాక్ట్ అయినందు వల్ల గంగూలీ పద్నాలుగు రోజులు హోమ్ ఐసొలేషన్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
గంగూలీతో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ కనీసం 10 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండనున్నారని తెలిపాయి. గంగూలీ ఇప్పటివరకు ఎలాంటి లక్షణాలను కలిగి లేరని సమాచారం. ఏదేమైనా, ప్రతిదీ సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి అతను కరోనా పరీక్ష చేయించుకుంటాడు. సౌరవ్ సోదరుడు స్నేహసిష్ గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ జాయింట్ సెక్రటరీ.
స్నేహసిష్ కుటుంబం – భార్య, అత్తగారు, బావ, మరియు తమ ఇంట్లోని పనిమనిషి కరోనా సోకింది. దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ ఏడాది ఐపీఎల్ కోసం గంగూలీ వైపు ఆసక్తిగా చూపిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్… అక్టోబర్ లో జరిగే టీ20 ప్రపంచ కప్ వాయిదా పడితే ఆ స్థానంలో ఐపీఎల్ జరపాలని గంగూలీ చూస్తున్నాడు. ఈలోగా ఇది వచ్చి పడింది.
ఇక పశ్చిమ బెంగాల్‌లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే బాధితుల సంఖ్య 32,838కి చేరగా.. 11,927 మంది ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. ఇక రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఈడెన్ క్రికెట్ మైదానాన్ని క్వారంటైన్ సెంటర్‌గా ఉపయోగించుకుంటామని కోల్‌కతా పోలీస్ క్యాబ్‌ను కోరింది.





