శ్రీలంక – దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న వన్డే సిరీస్ లో నాలుగవ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. చివరి ఓవర్ చివరి బంతి వరకు దోబూచులాడిన విజయం, ఫైనల్ గా శ్రీలంకను వరించింది. వర్షం వలన కుదించబడిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 39 ఓవర్లలో 306 పరుగులు చేసింది.
మరోసారి వర్షం అడ్డుపడడంతో దక్షిణాఫ్రికా లక్ష్యం 21 ఓవర్లలో 191 పరుగులుగా నిర్ణయించారు. దీంతో విధ్వంసకరమైన బ్యాటింగ్ చేసి, 20 ఓవర్లలో 183 పరుగులు సాధించారు. చివరి ఓవర్లో సఫారీ విజయానికి 6 బంతుల్లో 8 పరుగులు చేయాల్సి ఉండగా, చివరి ఓవర్లో రెండవ బంతికి మిల్లర్ అవుట్ కావడంతో, దక్షిణాఫ్రికా ఆశలు సన్నగిల్లాయి.
చివరి ఓవర్ లో అద్భుతమైన బౌలింగ్ తో లక్మల్ ఆకట్టుకున్నాడు. సఫారీ విజయానికి చివరి బంతికి బౌండరీ సాధించాల్సి ఉండగా, లక్మల్ కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చి, శ్రీలంకకు సిరీస్ తెచ్చిపెట్టాడు. అయిదు వన్డేల సెరిస్ లో నాలుగు మ్యాచ్ లు ముగిసే సమయానికి 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది శ్రీలంక.



