సుప్రసిద్ధ దర్శకుడు సాగర్ సోదరుడు మృతి!

srinivas-reddy-dies-at-apollo-cinematographyసీనియర్ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు ఉయ్యూరు శ్రీనివాస్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియలు బుధవారం నాడు జరపనున్నట్లు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగు చిత్ర పరిశ్రమ శ్రీనివాస్ రెడ్డి మృతిపై సంతాపం వ్యక్తం చేసింది.

ప్రముఖ దర్శకుడు సాగర్ కు సోదరుడు కావడంతో టాలీవుడ్ లో అందరికీ శ్రీనివాస్ రెడ్డి పరిచయం ఉన్న వ్యక్తి. సినిమాటోగ్రాఫర్, దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కొన్ని చిత్రాలకు వ్యవహరించారు. మౌళి, సుధాకర్ బాబు, సాగర్ లతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ‘జగదేకవీరుడు’, ‘అమ్మ దొంగ’ చిత్రాలను, నిర్మాత చంటి అడ్డాలతో కలిసి ‘ఆరోప్రాణం, బాచి, పవిత్ర ప్రేమ’ తదితర చిత్రాలను నిర్మించారు. ఇటీవల రష్మీ ప్రధాన పాత్రలో నటించిన “చారుశీల” సినిమాకు కూడా దర్శకత్వం వహించారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories