“శ్రీనివాస కళ్యాణం” ఆడియో – మిక్కి మాయాజాలం!

Srinivasa-Kalyanamసంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్ కు ప్రత్యేకమైన అభిమానులున్నారు. వారినందరినీ సంతృప్తి పరిచే విధంగా తన తాజా ఆల్బమ్ “శ్రీనివాస కళ్యాణం”ను రూపొందించాడు మిక్కీ. ఇటీవల విడుదల చేసిన మొదటి పాట ‘కళ్యాణం వైభోగం’కు అదిరిపోయే స్పందన రాగా, తాజాగా విడుదలైన ఫుల్ ఆల్బమ్ మిక్కి మాయాజాలానికి నిదర్శనంగా నిలుస్తోంది.

ఆల్బమ్ లో మొత్తం 7 పాటలుండగా, అందులో ఆరు పాటలు మెలోడీలో అలరిస్తాయి. ‘కళ్యాణం వైభోగం’ అనే పాట క్లైమాక్స్ వెర్షన్ ను ఇంకొకటి ఇచ్చారు. ఆల్బమ్ లో తొలి నాలుగు పాటలు ఒక దానిని మించి మరొకటి అనిపించే విధంగా ఆహ్లాదకరంగా, వినసొంపుగా ఉన్నాయి. ముఖ్యంగా మిక్కీ స్వరాలు వినేవారికి ఈ ఆల్బమ్ ఓ పండగ లాంటిదని పేర్కొనవచ్చు.

ADVERTISEMENT

రెండవ పాటగా వచ్చే ‘లైఫే చిన్నది బాసూ’ అంటూ ప్రారంభమయ్యే పాట హీరో క్యారెక్టర్ ను తెలిపే విధంగా ఉంటుంది. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ గా ఉండే ఈ పాట ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో హీరోల ఇంట్రడక్షన్ సాంగ్ ను తలపిస్తుంది. బహుశా ధనుంజయ్ స్వరం ఇందుకు ఓ కారణం కావచ్చు, శ్రీమణి సాహిత్యం క్యాచీగా ఉండగా, పాట వినసొంపుగా ఉంటుంది.

‘తెలుసా తెలుసా’ అంటూ మొదలైన మూడవ పాటలో శ్రేయా ఘోషల్ స్వరం మొదటిసారికే ఫ్లాట్ అయ్యేలా చేస్తుంది. శ్రీమణి సాహిత్యం అందించగా, మిక్కీ మార్క్ మెలోడీగా బాగుంటుంది. కేవలం మూడు నిముషాలు నిడివి మాత్రమే ఉండడం ఈ పాట స్పెషాలిటీ. ఇక నాలుగవ పాటగా వచ్చే ‘ఏ నిముషం నిను చూసానో’ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

అనురాగ్ కులకర్ణి – సునీతల స్వరంతో ఈ ఆల్బమ్ లో ఉన్న ఏకైక డ్యూయెట్ గా ఈ పాట నిలిచింది. ఈ ఆల్బమ్ లో అయిదవ పాటగా వచ్చే ‘సంథింగ్ సంథింగ్’ను ఆలపించిన వారిలో హీరోయిన్ రాశి ఖన్నా కూడా ఉండడం విశేషం. శ్రీమణి అందించిన ఈ పాట పాప్ సాంగ్ గా ఉంటుంది. రాశి ఖన్నాతో పాటు శ్రావణ భార్గవి, అనురాగ్ కులకర్ణిలు ఈ పాటను ఆలపించారు.

‘బ్రహ్మోత్సవం’లో ‘నాయుడోరింటి కాడ’ పాట ఎలా ఉంటుందో, ఈ ఆల్బమ్ లో ‘వినవమ్మా తూర్పు చుక్క’ అనే పాట నిలుస్తుంది. శ్రీమణి సాహిత్యం అందించగా, సునీత ఈ పాటను ఆలపించారు. ఫైనల్ గా ‘కళ్యాణం వైభోగం’ అన్న క్లైమాక్స్ వెర్షన్ తో ఎస్పీ బాలు స్వరం మరొకసారి శ్రోతలను మెస్మరైజ్ చేస్తూ ఆల్బం ముగుస్తుంది. ఇటీవల కాలంలో విడుదలైన సినిమాలో ‘బెస్ట్ ఆల్బమ్’గా “శ్రీనివాస కళ్యాణం”ను పేర్కొనవచ్చు.

ADVERTISEMENT
Latest Stories