
ఉత్తర ప్రదేశ్ రాజధాని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళలో బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగిన తొక్కిసలాటలో 20 మంది చనిపోయారు. వంద మందికి పైగా గాయపడ్డారు.
ఈరోజు తెల్లవారుజాము నుంచి పవిత్రమైన మౌని అమావాస్య ఘడియలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా గంగానదిలో పుణ్య స్నానాలు చేసేందుకు సెక్టార్-2లో వేచి చూస్తున్న భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ ఒక్కసారిగా ముందుకు కదిలేసరికి తొక్కిసలాట జరిగి ఈ విషాదం సంభవించింది.
Also Read – అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి కారన్న మాట!
పోలీసులు, వైద్య సిబ్బంది క్షతగాత్రులను, చనిపోయిన వారిని అంబులెన్సులలో ఆస్పత్రులకు తరలించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా యూపీ సిఎం యోగీ ఆదిత్యనాద్‌కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకొని కేంద్రం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తున్నారు.
తిరుపతిలో మహా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనం టికెట్స్ జారీ చేస్తున్నప్పుడు తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయినప్పుడు జగన్, వైసీపీ నేతలు ఏవిదంగా శవరాజకీయాలు చేశారో అందరూ చూశారు. కానీ ఈరోజు మహాకుంభమేళాలో 20 మంది చనిపోతే వైసీపీ నేతలు ఎవరూ స్పందించలేదు. కనీసం సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించలేదు.
Also Read – వివేకా హత్యతో సంబందం లేకపోతే భయం దేనికి?
ఎందువల్ల అంటే స్పందించినా దాని వలన వైసీపీకి ఎటువంటి రాజకీయ మైలేజ్ లభించదు కనుక! ఒకవేళ మృతులు లేదా క్షతగాత్రులలో ఆంధ్రాకు చెందినవారు ఉంటే తప్పకుండా చంద్రబాబు నాయుడుకి లంకె పెట్టి విమర్శించకుండా ఉండదు.