Star Heroes Kidsవిపరీతమైన స్టార్ డంని ఎంజాయ్ చేసే హీరోలకున్న పెద్ద సౌలభ్యం తమ తర్వాతి తరాన్ని కూడా అభిమానులకు అందివ్వడం. వాళ్లకు స్వాగతం చెప్పడానికి కూడా ఫ్యాన్స్ అంతకన్నా ఎక్కువ ఉత్సుకతతో ఎదురు చూస్తుంటారు. కానీ అనగనగా ఒక కాలంలో ఇదంత సులభంగా ఉండేది కాదు. సూపర్ స్టార్ కృష్ణ గారు మంచి ఫామ్ లో ఉన్నప్పుడే మహేష్ బాబుని జనానికి అలవాటు చేయడం కోసం చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేయించారు. వాటిలో అధిక శాతం హిట్లే. చదువు మీద ఫోకస్ పెట్టే నాటికి తను పబ్లిక్ లో రిజిస్టర్ కావడంతో రాజకుమారుడు ఎంట్రీ టైంలో ఇబ్బంది లేదు. ఒక్క రమేష్ బాబు విషయంలో మాత్రం ఆయన అంచనా నెరవేరలేదు.

ఇప్పుడు ట్రెండ్ మారింది. తారలు తమ వారసత్వాన్ని ప్రమోట్ చేసుకోవడానికి సోషల్ మీడియాని ఆయుధంగా చేసుకుంటున్నారు. నమ్రతా శిరోద్కర్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కూతురు సితారను ఆల్రెడీ ఒక మినీ సెలబ్రిటీగా మార్చేశారు. యూట్యూబ్ లో ఛానల్ పెట్టే స్థాయిలో మహేష్ తనయ దూసుకుపోతోంది. 1 నేనొక్కడినే చిన్న పాత్ర చేయించాక గౌతమ్ ని ఇంత లైమ్ లైట్ లోకి తీసుకురాలేదు. ఈ మధ్య తన ఫోటోలు వీడియోలు బాగానే బయటికి వస్తున్నాయి. ఇటీవలే జరిగిన గ్రాండ్ ఈ ప్రిక్స్ రేస్ లో విపరీతమైన సిగ్గరితనంతోనే మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రయత్నించాడు.

Also Read – నాల్రోజులు ఈ డ్రామాలు ఆపండర్రా వైసీపిలు…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రమం తప్పకుండా పిల్లల వీడియోలను షేర్ చేస్తుంటాడు. శాకుంతలంతో ఆల్రెడీ అర్హ డెబ్యూ కూడా అయిపోయింది. కొడుకుని ఫోటోలకు పరిమితం చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో బాగా గుట్టుని మైంటైన్ చేస్తున్నాడు కానీ ఇద్దరబ్బాయిల పిక్స్ అప్పుడప్పుడు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. వాళ్ళ రాకకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి తారక్ తొందరపాటు ప్రదర్శించడం లేదు. రామ్ చరణ్ త్వరలో తండ్రి కాబోతున్నాడు కాబట్టి తన ప్లాన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. ప్రభాస్ కింకా పెళ్లే కాలేదు కాబట్టి ఈ టాపిక్ అప్రస్తుతం.

ఇలా టాప్ లీగ్ అంటే టయర్ వన్ క్యాటగిరీలో ఉన్న వాళ్ళందరూ ముందస్తుగానే మంచి ప్లానింగ్ తో ఉన్నారు. పవన్ కళ్యాణ్ వారసుడు అకీరానందన్ ఎంట్రీ కావాలని అప్పుడే పవర్ స్టార్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇంకో వారసుడు పెద్దవడానికి ఇంకా చాలా టైం పడుతుంది కనక అకీరాకే ఫ్యానిజం చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఒకప్పుడు స్టార్లు తమ కూతుళ్లను స్క్రీన్ మీద చూపించడానికి జంకేవాళ్లు. అందుకే చిరంజీవి రజనీకాంత్ కృష్ణ తదితరులు ఆ ఆలోచనే చేయలేకపోయారు. కానీ ఇప్పుడు కాలం మారింది. యాక్షన్ కింగ్ అర్జున్ లాగా అమ్మాయిలను ధైర్యంగా పరిచయం చేసేందుకు అందరూ ఆలోచన చేసినా ఆశ్చర్యం లేదు. టైం మహత్యం మరి.

Also Read – గులకరాయి కేసు… జగన్ ను ఏ విధంగా నిలబెడుతుందో..?