Stock Market Crash: Investors Lose ₹7 Lakh Crore

గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో అంచలంచలుగా ఆల్ టైం హైస్ ను చూసిన దేశీయ మార్కెట్లు ఇన్వెస్టర్లను లాభాల బాట పట్టించాయి. అయితే అనూహ్యంగా గత కొన్ని నెలల నుంచి మాత్రం స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్టర్లను బ్లడ్ బాత్ తో భయపెడుతున్నాయి.

Also Read – ఏపీకి పెట్టుబడుల ప్రవాహం… చాలా అవసరమే!

అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా, ట్రంప్ టారిఫ్ నిబంధనలతో నేడు మార్కెట్లు నష్టాలబాట పట్టాయి. గత సెప్టెంబర్ నాటి గరిష్ట స్థాయితో పోలిస్తే నిఫ్ట్య్ దారుణంగా పతనమయ్యింది. ఈజీ గా డబ్బు ఆర్జించే వ్యాపారాలలో స్టాక్ మార్కెట్ బిజినెస్ ఒకటిగా ఉండేది.

అయితే గత కొన్ని నెలల నుంచి ఈజీ మనీ సంపాదించడం సంగతి అటుంచితే ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసిన సంపదంతా కూడా కళ్ళ ముందే ఆవిరైపోయే పరిస్థితి నెలకొంది. దీనితో ఇన్వెస్టర్లంతా ఎర్ర సముద్రం లా ఎరుపెక్కిన తమ పోర్ట్ ఫోలియో చూసి లబోదిబో మంటున్నారు. దీనితో స్టాక్ మార్కెట్లు సంపద సృష్టించడంలో కాదు హరించడంలో కూడా రికార్డు బ్రేక్ చేసినట్లయింది.

Also Read – అమరావతికి మరోసారి శంకుస్థాపన?

ట్రంప్ మామ నిర్ణయాలతో మార్కెట్లు కోలుకోలేని దెబ్బలను ఎదుర్కొంటున్నాయి. రోజుకో బ్రేకింగ్ న్యూస్, వారానికో సెన్సేషన్ అన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు తన నిర్ణయాలను, తమ ప్రభుత్వ విధానాలను ప్రకటిస్తున్నారు. దీనితో ట్రంప్ నుండి ఏ నిముషంలో ఏ నిర్ణయం వెలువడుతుందో అన్న భయం ఫారెన్ ఇన్వెస్టర్లను మార్కెట్లో నిలబడనివ్వవడం లేదు.

దీనితో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ లతో మార్కెట్లు ఎరుపెక్కుతున్నాయి. అయితే ఈ రోజు నిఫ్ట్య్ 420 పాయింట్లు నష్టపోయి 22,124 వద్ద ట్రేడ్ అవుతుండగా, సెన్సెక్స్ 1414 పాయింట్లు కోల్పోయి 73,198 పాయింట్ల వద్ద ముగిసింది. దీనితో దాదాపు ఈ ఒక్క రోజే 7 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరయిపోయింది. వరుసగా ఐదు నెలల నుంచి ఇలా దేశీయ మర్కెట్లు పతనం దిశగా దూసుకెళ్తున్నాయి.

Also Read – ఊరిస్తూనే…ఉసురుమనిపిస్తుందే..!


మరి ఈ నష్టాలకు స్టాప్ లాస్ లేదా.? ఇక ఇన్వెస్టర్లు ఈ నష్టాల నుంచి కోలుకునేదెప్పుడు.? ఇలా అంతర్జాతీయ పరిణామాలతో కుదేలవుతున్న దేశీయ మార్కెట్లు తిరిగి లాభాల బాట పట్టాలన్నా, ఇన్వెస్టర్ల ఖాతాలో గ్రీన్ కాండిల్స్ వెలగాలన్న ప్రభుత్వాలు రంగ ప్రవేశం చేయాల్సిందేనా.?