Sukumar Pushpa 2 Producers Met Chiranjeevi

కుటుంబాలు చీల్చే రాజకీయమే మా సిద్ధాంతం అన్నటుగా ముందుకెళ్లే వైసీపీ తన నీచ రాజకీయంతో కొంతవరకు తాత్కాలిక ఆనందాన్ని పొందినప్పటికీ చివరికి బకరా గా మారడం పరిపాటుగా మారుతుంది.

వైసీపీ హయాంలో చిరు, పవన్ ల మధ్య గ్యాప్ వచ్చినట్టు సృష్టించిన వైసీపీ కొంతకాలం దాని మీద రాజకీయం చేసి పైశాచిక ఆనందాన్ని పొందింది. అయితే చివరికి జనసేనకు మద్దతుగా కూటమి నేతల గెలుపుకి ప్రకటనలు చేసిన చిరు వైసీపీ కి ఊహించని షాక్ ఇచ్చారు.

Also Read – ఈ విందుని జగన్‌ జీర్ణించుకోలేరేమో?

దీనితో పవన్, చిరు ల రాజకీయ చిచ్చు పెట్టాలని చుసిన వైసీపీ చివరికి బకరాగా మిగిలిపోయింది. ఇప్పుడు అదే తరహాలో మెగా vs అల్లు అంటూ సాగుతున్న సోషల్ మీడియా రచ్చను కూడా తన పార్టీ రాజకీయం కోసం వాడుకుంటున్నారు వైసీపీ నేతలు. మాజీ మంత్రి అంబటి రాంబాబు పుష్ప సినిమా రివ్యూ లు కూడా ప్రకటిస్తూ పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటున్నావా…వరల్డ్ ఫైర్ అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ఇక వైసీపీ ఆస్థాన దర్శకుడు ఆర్జీవీ కూడా ఎప్పటి మాదిరిగానే మెగా ఫ్యామిలి మీద తనకున్న ఏడుపును మరోసారి పుష్ప రూపంలో బయటపెట్టుకున్నారు. మెగాకే మెగా అల్లు అర్జున్ అంటూ చిరుని తగ్గించి అల్లు ని పెంచే ప్రయత్నం చేసారు. అయితే ఒకరు తగ్గిస్తేనో, ఒకరు చెరిపిస్తేనో సినీ ఇండస్ట్రీలో మెగా స్టార్ చిరు స్థానం చెరిగిపోదు, తగ్గిపోదు.

Also Read – అందరికీ పంచింగ్ బ్యాగ్ మన టాలీవుడ్‌?

ఈ విషయాన్ని ధృవీకరించేలా నేడు పుష్ప దర్శకుడు సుకుమార్, నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. అలాగే చిరు కూడా పుష్ప చిత్ర విశేషాలు అడిగి తెలుసుకుని పుష్ప టీం కు తన ఆశీస్సులు, అభినందనలు అందించినట్టు సమాచారం.

అయితే ఇక్కడ చిత్ర బృందం తో పాటుగా హీరో పుష్ప రాజ్ అల్లు అర్జున్ లేకపోవడం ఒక లోటుగా ఉన్నప్పటికీ ఆ గ్యాప్ కూడా చెరిగిపోయే రోజు రానున్నది అంటున్నారు సినీ వర్గాలు. అజాత శత్రువుగా, సినీ ఇండస్ట్రీ పెద్దన్నగా భావించే చిరు స్థాయిని తగ్గించేలా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో కొన్ని డైలాగ్స్ చెప్పించారు అంటూ వైసీపీ చేస్తున్న విష ప్రచారం, కుటుంబాలను చీల్చి రాజకీయం చేయాలనే వైసీపీ ఆకాంక్షకు కొంతవరకు బ్రేకులు పడ్డట్టే అంటున్నారు సినీ అభిమానులు.

Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్‌ విధ్వంసానికి…

ఇప్పుడు పుష్ప టీం చిరుని కలిసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వైసీపీ మరోసారి ‘మెగా బకరా’ అయ్యింది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. అలాగే సుక్కు తరువాత సినిమా కూడా రామ్ చరణ్ తో కావడం, దానికి నిర్మాతలుగా మైత్రి మూవీ మేకర్స్ అవ్వడం కూడా ఇక్కడ విశేషం.




రంగస్థలం వంటి భారీ విజయం తరువాత సుక్కు, చెర్రీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది అంటూ ప్రకటించారు నిర్మాతలు. RRR తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చెర్రీ, పుష్ప తో దర్శకుడు జక్కన సరసన చోటు దక్కించుకున్న సుక్కు కాంబోలో రాబోతున్న నెక్ట్ మూవీ పుష్ప – 2 ని మించి ఉంటుందనడంలో సందేహం లేదు.