supreme-court-dismisses-ysrcp-petition

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీని దాని అధినేత చంద్రబాబు నాయుడుని ఏదో విదంగా అడ్డుతొలగించుకుంటే తప్ప తాను ఎల్లకాలం అధికారం చేయలేనని బాగా గ్రహించారు.

చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీని దాని అధినేత, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఆయన ఏవిదంగా ఎదుర్కొన్నారో అదే విదంగా జగన్‌ కూడా చంద్రబాబు నాయుడుని రాజకీయంగా ఎదుర్కొని పైచేయి సాధించే ప్రయత్నం చేసి ఉంటే అందరూ హర్షించేవారు.

Also Read – జగన్‌కి విరుగుడు వారిద్దరే… ఏమవుతుందో?

కానీ చంద్రబాబు నాయుడుని రాజకీయంగా ఎదుర్కోవడం తన వల్ల కాదని గ్రహించిన జగన్‌ ఏదో ఓ కేసులో ఆయనని బుక్ చేసి లోపల వేసి ఆ యన ప్రతిష్టకి భంగం కలిగించి ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టగలిగితే చాలనుకున్నారు. అందుకే స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు సృష్టించి చంద్రబాబు నాయుడుని లోపల వేశారు.

జగన్‌ దూరం ఆలోచించే ఎన్నికలకు దాదాపు ఏడాది ముందుగా ఈ కేసులో అరెస్ట్‌ చేయించారు. తద్వారా ఎన్నికల వరకు ఆయన జైల్లోనే మగ్గుతారని, ఆలోగా టీడీపీలో మిగిలిన ముఖ్య నాయకులను కూడా ఏదో కేసులలో ఇరికించి లేదా బెదిరించి లొంగతీసుకుంటే ఇక ఎన్నికలలో వైసీపీకి తిరుగే ఉండదని జగన్‌ అనుకున్నారు.

Also Read – ఢిల్లీ బీజేపి ఊడ్చేస్తే తెలంగాణలో కళ్ళాపి తప్పదేమో?

జగన్‌ బుర్రలో ఈ ప్లాన్ ఉంది గనుకనే ఈసారి 175 కి 175 సీట్లు మనవే పదేపదే చెపుతుండేవారు. కానీ జగన్‌ ఒకటనుకుంటే దేవుడి స్క్రిప్ట్ వేరేలా ఉంది. ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే.

ఆనాడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు బెయిల్‌ కోసం దరఖాస్తు చేరుకోగా సుప్రీంకోర్టు మంజూరు చేయడంతో బయటపడ్డారు. అదే కేసు మళ్ళీ నేడు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది.

Also Read – బీజేపి విజయంలో చంద్రబాబు… కొందరికి ఎసిడిటీ తప్పదు!

‘చంద్రబాబు నాయుడు బెయిల్‌ రద్దు చేయమని గత ప్రభుత్వ హయంలో వేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగించాలా?ఆయన బెయిల్ రద్దు చేయమని కోరుతున్నారా?’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అడిగితే, ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ ఏం సమాధానం చెపుతారో ఊహించుకోవచ్చు.

ఈ కేసులో అవసరమైతే ఏపీ ఏసీబీ విచారణకు సిఎం చంద్రబాబు నాయుడు సహకరించాలని సూచిస్తూ, సుప్రీంకోర్టు బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేసింది.




జగన్‌ ఎంతో ప్లాన్ చేసి చంద్రబాబు నాయుడుని అరెస్ట్‌ చేయించగలిగారు. జైల్లో పెట్టగలిగారు. కానీ ఈ కేసులో ఏమీ సాధించలేకపోగా ఇదే కారణంగా ఎన్నికలలో వైసీపీని ఓడించుకున్నారు. చివరికి ఈ కేసుని ఢిల్లీ వరకు తీసుకువెళ్ళినా చివరికి ఇది కూడా ఈవిదంగా ముగిసిపోయింది. ‘ఆపరేషన్ సక్సస్ బట్ పేషంట్ డెడ్’ అంటే ఇదేనేమో?